E-Paper
Advertisement

Nara Lokesh Tour: ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి లోకేశ్ బిజీబిజీ.. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా భేటీలు

Nara Lokesh Tour: ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి లోకేశ్ బిజీబిజీ.. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా భేటీలు
Advertisement

Nara Lokesh Tour: మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఓవైపు రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణతో పాటు మరోవైపు భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉన్న సమస్యలను కూడా పరిష్కరించుకుంటున్నారు. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న మంత్రి లోకేశ్.. అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టార్టప్‌లు, గ్రీన్ టెక్నాలజీలో సహకారాన్ని ప్రోత్సహించేందుకు ఏపీ-న్యూసౌత్ వేల్స్ ఇన్నోవేషన్, ఇండస్ట్రీ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. న్యూసౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్ మిన్స్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన లోకేశ్.. ఇన్నోవేషన్, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఏపీ, న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వాల మధ్య ఒప్పందాన్ని సులభతరం చేయాలని కోరారు.

ఎన్జీ రంగా వర్సిటీతో కలిసి పనిచేయండి

వెస్ట్రన్ సిడ్నీ వర్సిటీని మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. వర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, అగ్రికల్చరల్ టెక్నాలజీ పరిశోధకులతో పలు అంశాలు చర్చించారు. ఏపీలో వ్యవసాయ ఆధునీకరణకు, ప్రెసిషన్ ఫార్మింగ్‌లో నైపుణ్యాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పంచుకోవాలని లోకేశ్ కోరారు. రైతులు, అగ్రి-ప్రొఫెషనల్స్‌కు స్మార్ట్ ఫార్మింగ్ టెక్నిక్‌లు, అగ్రి-టెక్ ఇన్నోవేషన్లలో శిక్షణ ఇచ్చే సంయుక్త కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

Advertisement

ఇక ఏపీ విశ్వవిద్యాలయాలతో స్థిరమైన నీటి నిర్వహణ తదితర ప్రాజెక్టులపై సహకారం అందించాలని నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థలు, AI ఆధారిత వ్యవసాయ పరిష్కారాలను అభివృద్ధి చేసే ఇన్నోవేషన్ హబ్‌ల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఇక ఈనెల 24వరకు మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన కొనసాగనుంది.

భారత్ రొయ్యల ఎగుమతికి తొలగిన అడ్డంకి

భారత్‌ నుంచి రొయ్యల దిగుమతికి ఆస్ట్రేలియాలో అడ్డంకి తొలగింది. పొట్టు తీయని రొయ్యల ఎగుమతికి లైన్‌ క్లియర్‌ అయింది. ఆంక్షలు తొలగడంపై మంత్రి లోకేశ్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. భారత్‌ నుంచి ఆస్ట్రేలియాకు రొయ్యల ఎగుమతికి లైన్‌ క్లియర్‌ అయిందన్నారు. పొట్టు తీయని రొయ్యలపై ఆస్ట్రేలియా విధించిన ఆంక్షలు తొలిగిపోయాయని చెప్పారు. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఎక్స్ లో పోస్టు చేశారు. 2025 అక్టోబర్‌ 20 నుంచి 2027 అక్టోబర్‌ 20వరకు రొయ్యలను ఎగుమతి చేసుకోవచ్చు.

Advertisement

Also Read: Heavy Rains In AP: బంగాళాఖాతంలో వాయుగుండం.. కోస్తా, రాయలసీమలో అతి భారీ వర్షాలు.. ఏపీ ప్రభుత్వం అలర్ట్

భారత్ నుంచి సీఫుడ్స్ ఎక్స్ పోర్ట్ కు చాలా కాలంగా ఉన్న అడ్డంకి తొలగిపోయిందని మంత్రి నారా లోకేశ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకోసం కృషి చేసిన భారత అధికారులకు లోకేశ్‌ ధన్యవాదాలు తెలిపారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×