E-Paper
Advertisement

Liquor Price Hike: సంక్రాంతి వేళ మందు బాబులకు షాక్.. 10 రూపాయల చొప్పున పెంచిన ఏపీ ప్రభుత్వం

Liquor Price Hike: సంక్రాంతి వేళ మందు బాబులకు షాక్.. 10 రూపాయల చొప్పున పెంచిన ఏపీ ప్రభుత్వం
Advertisement

Liquor Price Hike: సంక్రాంతి వేళ మందుబాబులకు షాకిచ్చింది ఏపీ ప్రభుత్వం.  స్వల్పంగా మద్యం ధరలు  పెంచింది. ప్రతి మద్యం బాటిల్ కు 10 రూపాయల చొప్పున పెంచేసింది. ఈ మేరకు ఎక్సైజ్‌‌శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. అయితే పెంచిన లిక్కర్ ధరలు ఐఎంఎఫ్‌ఎల్‌, ఫారిన్‌ లిక్కర్‌కు వర్తిస్తుందని పేర్కొంది.

సంక్రాంతి వేళ మందు బాబులకు ఏపీ షాక్

Advertisement

మందుబాబులకు కిక్కు దిగే వార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నార్మల్ కంటే పండగ వేళ మద్యం విక్రయాలు జోరుగా సాగుతాయి. ఈసారి సంక్రాంతికి మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదు అవుతాయని అంచనాలు లేకపోలేదు. పండుగకు ఇంటికెళ్లినవారు తమ స్నేహితులతో మద్యం తాగుతూ చిల్ అవుతారు.

దీనికితోడు కోళ్ల పందేలు జరిగే ఏరియాల్లో మద్యం ఏరులై పారుతుంది. ఈ క్రమంలో లిక్కర్ ధరలు పెంచడంతో మందుబాబులకు తాగకుండానే షాక్ తగిలింది. రూ. 99 ధర కలిగిన మద్యం బాటిళ్లను మినహాయించింది. మిగతా అన్నింటిపై రూ.10 చొప్పున పెంచింది. అలాగే రూ.99 లోపున్న బీర్, వైన్ బాటిళ్లకు పెంచకుండా ఉపశమనం కలిగింది.

Advertisement

మద్యం బాటిళ్లపై పది రూపాయల చొప్పున పెంపు

బార్లపై అదనంగా ఉన్న అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ రద్దు చేసింది. వైన్స్‌ షాపుల లైసెన్సులకు ఇచ్చే లాభాన్ని ఒక శాతం పెంచింది. బార్లపై అదనపు ఏఆర్‌ఈటీ రద్దు చేయడంతో వైన్‌ షాపులు, బార్లలో మద్యం ధరలు ఒకేలా ఉండనున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం బార్ల లైసెన్సీలపై 10 శాతం అదనంగా ఏఆర్‌ఈటీ విధించింది.

షాపుల కంటే బార్లు 10 శాతం అదనంగా ధరలు చెల్లిస్తున్న విషయం తెల్సిందే. ధరల వ్యత్యాసాన్ని సవరించాలని బార్ల యజమానులు కొన్నాళ్లుగా ప్రభుత్వాన్ని కోరారు. అదనపు ఏఆర్‌ఈటీ రద్దు వల్ల ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం తగ్గనుంది. ఈ లోటు భర్తీ కోసం మద్యం బాటిల్‌పై రూ.10 చొప్పున ధర పెంచింది.

ALSO READ: మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ కన్నుమూత

జనవరి ఒకటిన ఏపీలో రికార్డ్ స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం వచ్చింది. సంక్రాంతి పండుగకు మద్యం ధరలను పెంచడంతో ఆదాయం పెరిగే అవకాశముందని ఎక్సైజ్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు బీరు తయారు చేసి విక్రయించే మైక్రో బ్రూవరీ పాలసీ నిబంధనలు సవరించింది.

ఇకపై మున్సిపల్‌ కార్పొరేషన్ల వెలుపల 5 కిలోమీటర్ల పరిధి వరకు త్రీ స్టార్‌, పెద్ద హోటళ్లలో మైక్రో బ్రూవరీలు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. ధరల పెంపు నిర్ణయంతో ప్రభుత్వానికి ఏటా దాదాపు రూ.1,391 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×