E-Paper
Advertisement

Anantapur Central University: అనంతపురం సెంట్రల్ వర్సిటీ.. విద్యార్థుల నిరసనలు, బాత్రూమ్‌లో

Anantapur Central University: అనంతపురం సెంట్రల్ వర్సిటీ.. విద్యార్థుల నిరసనలు, బాత్రూమ్‌లో
Advertisement

Anantapur Central University: అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ లో విద్యార్థినులు రాత్రి ధర్నా నిర్వహించారు. గుర్తు తెలియని వ్యక్తులు విద్యార్థినుల బాత్ రూం లోకి తొంగి చూశారంటూ ఆరోపించారు. బాత్ రూంల దగ్గర నిచ్చెనలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై వీసీ సమాధానం చెప్పాలని విద్యార్థుల డిమాండ్ చేస్తున్నారు. ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్దాం

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. ఆదివారం రాత్రి వర్సిటీ విద్యార్థిణులు ఆందోళనకు దిగారు. గుర్తు తెలియని వ్యక్తులు మహిళా హాస్టల్స్ వద్దకు వస్తున్నారని, బాత్రూమ్‌ల్లోకి తొంగి చూశారని ఆరోపించారు. ఈ క్రమంతో స్టూడెంట్స్ అంతా ఆందోళనకు దిగారు. తొలుత ఈ విషయాన్ని వీసీ దృష్టికి తీసుకెళ్లామని అంటున్నారు. ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో నిరసనలు, ధర్నాలకు దిగాల్సి వచ్చిందన్నది మహిళా విద్యార్థుల మాట.

Advertisement

ఆదివారం రాత్రి కూడా కొందరు గుర్తు తెలియని అగంతకులు విద్యార్థినుల హాస్టల్ వైపు వచ్చారు. తమ వాష్ రూములోకి తొంగి చూడటాన్ని గమనించారు. వెంటనే కేకలు వేయగా అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే విద్యార్థినులు ఈ విషయాన్ని మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ల నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో అర్ధరాత్రి వేళ క్యాంపస్ రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు.

సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినులకు రక్షణ లేకపోవడంపై తల్లిదండ్రులతో పాటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి విషయాన్ని విద్యార్థులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో బుక్కరాయసముద్రం పోలీసులు నిర్లక్ష్యంగా వహించారని విమర్శలున్నాయి. ఎమ్మెల్యే అయిన బండారు శ్రావణి యూనివర్సిటీకి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.

Advertisement

ALSO READ:  తిరుమల లడ్డూ కేసు.. తీగ లాగుతున్న సిట్, ఆ ఇద్దరికీ నోటీసులు?

వచ్చినవారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటివరకు ఆ మహిళా ఎమ్మెల్యే ఆదేశాలను పోలీసులు పట్టించుకోలేదు. అక్కడ విద్యార్థులకు రక్షణ లేదని వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×