E-Paper
Advertisement

Ambati Rayudu: వైసీపీకి షాక్.. అంబటి రాయుడు రాజీనామా

Ambati Rayudu: వైసీపీకి షాక్.. అంబటి రాయుడు రాజీనామా
Advertisement

Ambati Rayudu: క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేశారు. గతేడాది డిసెంబర్ 28న అంబటి రాయుడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.వైసీపీ నుంచి గుంటూరు ఎంపీ ఆశించిన అంబటి రాయుడికి నిరాశ ఎదురైంది. వైసీపీ నుంచి ఎంపీ టికెట్ రాకపోవడంతోనే అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

రాజకీయాలకు కొన్నాళ్లు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు అంబటి రాయుడు పేర్కొన్నాడు. ఈ మేరకు X లో ట్వీట్ చేశారు. త్వరలోనే తన రాజకీయ జీవితంపై మరో నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు తెలిపారు.

Advertisement

ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే వైఎస్సార్సీపీ రెండు విడతలుగా నియోజకవర్గ ఇన్ చార్జుల లిస్టులు ప్రకటించగా.. వీటిలో చాలామంది సీనియర్లకు అధిష్టానం మొండిచేయి చూపించింది. దాంతో.. పార్టీనే నమ్ముకుని ఉన్నవారు మోసపోయామంటూ పార్టీని వీడుతున్నారు. మరికొంతమంది నేతలు కూడా పార్టీని వీడనున్నట్లు సమాచారం. బాలినేని శ్రీనివాసరెడ్డి సహా కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో.. పార్టీలో ప్రకంపనలు మరింత ఎక్కువయ్యాయి. వైసీపీని వీడిన రాయుడు.. తర్వాత ఏ పార్టీవైపు అడుగులేస్తారో చూడాలి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×