E-Paper
Advertisement

Ambati Rambabu: నవరత్నాలే కాదు, జగన్ కూడా ఫెయిల్యూర్.. అంబటి అంత మాట అనేశావేంటీ?

Ambati Rambabu: నవరత్నాలే కాదు, జగన్ కూడా ఫెయిల్యూర్.. అంబటి అంత మాట అనేశావేంటీ?
Advertisement

Ambati Rambabu: ఏపీలో నిత్యం వార్తల్లో నిలిచే పొలిటిషియన్స్ లో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒకరు. ఆయన తన మాటలు, చేతలతో ఏదోక రూపేనా చర్చనీయాంశం అవుతూనే ఉంటారు. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu)ను తీవ్ర పదజాలంతో దూషించి.. జైలుకు సైతం వెళ్లి వచ్చారు. దీంతో అంబటి పొలిటికల్ గా కాస్త సైలెంట్ అవుతారని అంతా భావించారు. కానీ ఆయన తన మాటల తూటాలను ఇంకా పేలుస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాటల తూటా.. ఈసారి జగన్ కు తాకడం నెట్టింట చర్చకు దారి తీసింది.

జగన్‌ను ఇరికించిన అంబటి!

ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూకు హాజరైన అంబటి రాంబాబు.. తన చొక్క జేబుకు నవరత్నాలతో పాటు జగన్ ఫొటో ఉన్న స్టిక్కర్ ను అంటించుకొని వచ్చారు. దీనిపై యాంకర్ స్పందిస్తూ.. ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ స్టిక్కర్ తోనే కనిపిస్తున్నారేంటని ప్రశ్నించారు. అప్పుడు అంబటి నవరత్నాలు అని చెప్పగా.. వెంటనే యాంకర్ అది ఫెయిల్యూర్ కదా అని సమాధానం ఇచ్చారు. అది ప్రజల్లో విఫలమైంది కాబట్టే మీ పార్టీకి (YSRCP) ఓట్లు రాలేదని అన్నారు. ఇక్కడే అంబటి రాంబాబు షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. అసలు సందర్భమే లేకపోయినా.. జగన్ ను ఇందులోకి లాక్కొచ్చారు. నవరత్నాలతో పాటు జగన్ కూడా ఫెయిలే కదా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Advertisement

అప్రూవర్‌గా మారిన అంబటి!

అంబటి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. టీడీపీ – జనసేన శ్రేణులు ఈ వీడియోను పెద్ద ఎత్తున ట్రెండింగ్ చేస్తున్నారు. ఇన్నాళ్లకు అంబటి రాంబాబు నిజం ఒప్పుకున్నారని కామెంట్స్ పెడుతున్నారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక జగన్ పూర్తిగా విఫలమయ్యారని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అంబటి రాంబాబు అప్రూవర్ గా మారి.. నిజాలన్నీ బయటకు చెప్పేస్తున్నారని పేర్కొంటున్నారు. మరోవైపు జగన్ అభిమానులు సైతం అంబటి వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును దూషించి పార్టీని చిక్కుల్లో పడేసింది గాక, ఇప్పుడు నేరుగా అధినేతనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read: AC vs Air Cooler: ఏసీ కొంటే బెటరా? లేదా కూలర్ మంచిదా? మధ్యతరగతి ఇంటికి ఏది బెస్ట్?

సినిమాల్లోకి అంబటి?

సంక్రాంతి సందర్బంగా నిర్వహించిన సంబురాల్లో డ్యాన్స్ చేసి అంబటి రాంబాబు యావత్ రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని యాంకర్ ప్రస్తావిస్తూ.. డ్యాన్స్ బాగా చేశారని, సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. అప్పుడు అంబటి రాంబాబు సమాధానం ఇస్తూ.. ‘సినిమాల్లో నటిస్తే తప్పేమి ఉంది. నా వయసు, హోదాకు తగ్గట్లు పాత్ర వస్తే తప్పకుండా చేస్తాను. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. నేను రాజకీయాల్లో నుంచి సినిమాల్లోకి వెళ్తే తప్పేముంది’ అంటూ చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి సరైన పాత్ర దొరికితే ఆయన త్వరలోనే వెండితరపై కనిపించే అవకాశముందని నెట్టింట చర్చించుకుంటున్నారు.

Also Read: LPG Statistics: దేశంలో గ్యాస్ సంక్షోభం.. LPG గురించి.. ఆశ్చర్యపరిచే వాస్తవాలు!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×