E-Paper
Advertisement

Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో కేసులో బెయిల్.. రేపు జైలు నుంచి విడుదల!

Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో కేసులో బెయిల్.. రేపు జైలు నుంచి విడుదల!
Advertisement

Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టులో ఊరట లభించింది. వేర్వేరు కేసుల్లో ఆయనకు కోర్టు వరుసగా బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆయనకు బెయిల్ రాగా, తాజాగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించిన మరో కేసులోనూ బెయిల్ లభించింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నేత అంబటి రాంబాబును ఫిబ్రవరి 7, 2026న పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) విధానంలో నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన ఈ నిరసనల కారణంగానే ఆయనపై కేసులు నమోదై, అరెస్టుకు దారితీసింది.ఈ కేసుపై విచారణ జరిపిన గుంటూరు కోర్టు, ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది.

Advertisement

అన్ని ప్రధాన కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో, అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది. న్యాయపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత, ఆయన రేపు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. వరుస బెయిల్ మంజూరుపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Read Also: Actor Suman: వెంకన్న భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు.. వారిని జైలుకు పంపాల్సిందే..? సుమన్ సంచలన వ్యాఖ్యలు

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×