E-Paper
Advertisement

Ambati Rambabu: చెప్పుతో కొడతాం.. నాలుక చీరేస్తాం.. టీడీపీ శ్రేణుల ముట్టడితో గుంటూరులో హైటెన్షన్!

Ambati Rambabu: చెప్పుతో కొడతాం.. నాలుక చీరేస్తాం.. టీడీపీ శ్రేణుల ముట్టడితో గుంటూరులో హైటెన్షన్!
Advertisement

Ambati Rambabu: ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ముఖ్యంగా మహిళా నాయకులు భారీ ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంబటి ఇంటిని ముట్టడించారు.

అంబటి రాంబాబు వ్యాఖ్యలపై మండిపడుతున్న టీడీపీ మహిళా కార్యకర్తలు ఆయన ఇంటి వైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఓ మహిళా కార్యకర్త అంబటిని చెప్పుతో కొడతానంటూ తీవ్రంగా హెచ్చరించడం అక్కడి ఉద్రిక్తతను పరాకాష్టకు తీసుకెళ్లింది. వెంటనే ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో వైసీపీ శ్రేణులు కూడా అక్కడకు చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి.. పరిస్థితి హైటెన్షన్‌గా మారింది. నిరసనకారులు అంబటి ఇంటిలోకి చొరబడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడమే కాకుండా, ఈ ఘర్షణల్లో పలువురికి గాయాలు కూడా అయ్యాయి.

Advertisement

ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు తీవ్రంగా స్పందించారు. అంబటి రాంబాబు ఎక్కడ కనబడితే అక్కడ చెప్పులతో కొడతాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమకు చంద్రబాబు లాగా సహనం, ఓపిక లేవని, నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. ఆంబోతు రాంబాబును వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు, అంబటిపై గుంటూరులో ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు.

అంబటి తీరుకు నిరసనగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. అనంతపురంలో తెలుగు అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో టవర్ క్లాక్ సర్కిల్ వద్ద అంబటి దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్రంలోని వివిధ జంక్షన్లలో తెలుగు తమ్ముళ్లు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం అంబటి నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. రాజకీయ విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగత దూషణల వరకు వెళ్లడం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

Also Read: ప్రియురాలి శాడిజం..బిడ్డకు పాలిస్తున్న ప్రియుడి భార్యపై పెట్రోల్‌ పోసి..

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×