E-Paper
Advertisement

Ambati Arrest: అంబటి రాంబాబు అరెస్ట్.. ఆయన ఇంటిని- కారుని తగలబెట్టిన టీడీపీ శ్రేణులు, ఆపై కోర్టుకి

Ambati Arrest: అంబటి రాంబాబు అరెస్ట్.. ఆయన ఇంటిని- కారుని తగలబెట్టిన టీడీపీ శ్రేణులు,  ఆపై కోర్టుకి
Advertisement

Ambati Arrest: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నవభారత్ నగర్‌లోని నివాసంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు, తీవ్ర ఉద్రిక్తత మధ్య వాహనంలోకి ఎక్కించి స్టేషన్‌కి తరలించారు.

ఎట్టకేలకు హైడ్రామా మధ్య అంబటి అరెస్ట్, పీఎస్‌కు తరలింపు

Advertisement

ఎట్టకేలకు 10 గంటల హైడ్రామా మద్య మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి 11 గంటల సమయంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అంబటి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ వైపు టీడీపీ శ్రేణులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

ఐనప్పటికీ టీడీపీ కార్యకర్తలు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. రాళ్లు రువ్వుతున్నా పోలీసులు పట్టించుకోకుండా భారీ భద్రత మధ్య అంబటిని అరెస్టు చేశారు. పోలీసుల వాహనంలో ఆయన్ని  నల్లపాడు పీఎస్‌కు తరలించారు. అప్పటికీ గానీ టీడీపీ కార్యకర్తలు శాంతించలేదు. దీనిపై టీడీపీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాజీ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

ఇంటికి, కారుకి నిప్పు పెట్టిన టీడీపీ శ్రేణులు

అరెస్టు సమయంలో అటు అంబటి మద్దదారులకు-టీడీపీ కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఓ కారు, ఓ ఇంటిని తగలబెట్టాయి టీడీపీ శ్రేణులు. చివరకు టీడీపీ కార్యకర్తలను సముదాయించి అక్కడి నుంచి పంపించివేశారు పోలీసులు.

మరోవైపు అంబటి వ్యాఖ్యల వ్యవహారం నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్‌లో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఆపై కేసులు నమోదు చేశారు కూడా. అసలు వివాదానికి కారణమేంటి? తిరుమల లడ్డూల్లో నెయ్యి కల్తీ జరిగిందంటూ టీడీపీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. దీనిపై మాట్లాడిన అంబటి రాంబాబు ఆవేశంగా మాట్లాడారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబుపై అసభ్యకరమైన కామెంట్స్ చేశారు.

ALSO READ: నోరు అదుపులో పెట్టుకో.. అంబటి రాంబాబుకు హోం మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్!

ఇదీ అసలు అరెస్టు వెనుక అసలు కారణం. దీంతో ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. ఈ క్రమంలో అంబటి ఇంటిపై రాళ్లు రువ్వడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

మరోవైపు మాజీ మంత్రి అంబటి భార్య విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. తనతో పాటు సుమారు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉందని, తనకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని అందులో ప్రస్తావించారు.

ఈ నేపథ్యంలో తనకు-తన కుటుంబానికి పోలీసు భద్రతను ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. తన ప్రాథమిక హక్కులకు పోలీసులు భంగం కలిగిస్తున్నారని,వెంటనే న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరపాల్సివుంది.

https://twitter.com/bigtvtelugu/status/2017767506166088184

 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×