E-Paper
Advertisement

Ambati vs Pawan: అంబటి కోసం జగన్ కాదట.. పవన్ దిగి రావాలట.. ఇదేం దిక్కుమాలిన లాజిక్కో..!

Ambati vs Pawan: అంబటి కోసం జగన్ కాదట.. పవన్ దిగి రావాలట.. ఇదేం దిక్కుమాలిన లాజిక్కో..!
Advertisement

Ambati vs Pawan: వైసీపీ నేత, మాజీ సీఎం అంబటి రాంబాబు అరెస్టు (Ambati Rambabu Arrest) అనంతర పరిణామాలు ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి. అంబటి ఎపిసోడ్ ను ‘కాపు వర్సెస్ కమ్మ’ (Kapu vs Kamma)గా ప్రొజెక్ట్ చేసేందుకు విపక్ష వైసీపీ నేతలు, కార్యకార్తలు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సోమవారం మీడియా ముందుకు వచ్చిన అంబటి కూతురు మౌనిక (Ambati Mounika).. చాలా ఎమోషనల్ అయ్యారు. కాపులపై జరుగుతున్న అణిచివేత ధోరణిగా అంబటి అరెస్టును అభివర్ణించారు. కాపులకు ఇంత అన్యాయం జరుగుతుంటే పవన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు.

పవన్‌కు సూటి ప్రశ్నలు

ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu)ను అంబటి రాంబాబు తీవ్ర పదజాలంతో దూషించిన నేపథ్యంలో ఆయన ఇంటిపై పదుల సంఖ్యలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడిన అంబటి కూతురు మౌనిక.. కాపు నేతగా పేరున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Dy.CM Pawan Kalyan) కు సూటి ప్రశ్నలు వేశారు. కాపు మహిళలమైన తమపై దాడులు చేస్తుంటే.. లకారాలతో బండబూతులు తిడుతుంటే పవన్ ఎక్కడ ఉన్నారని నిలదీశారు. 8 గంటల పాటు తమపై దాడి కొనసాగిందన్న మౌనిక.. స్త్రీల రక్షణ, క్షేమం గురించి నిత్యం మాట్లాడే పవన్ కళ్యాణ్ దీనిపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

పవన్ ఎందుకు స్పందించాలి?

Advertisement

అయితే అంబటి మౌనిక చేసిన వ్యాఖ్యలను జనసైనికులు తిప్పుకొడుతున్నారు. అంబటి రాంబాబును కాపు నేతగా చిత్రీకరించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. వైసీపీ హయాంలో పవన్ కళ్యాణ్ పై అంబటి పదే పదే అభ్యంతర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని మర్చిపోయారా? అంటూ నిలదీస్తున్నారు. తోటి కాపు అయిన పవన్ ను పట్టుకొని ప్యాకేజీ స్టార్, మూడు పెళ్లిళ్లు, దత్తపుత్రుడు అంటూ వ్యక్తిగతంగా వైఎస్ జగన్, సజ్జల రామకృష్టారెడ్డి వంటి వాళ్లు విమర్శిస్తుంటే అంబటి ఎందుకు మిన్నకుండిపోయారని నిలదీస్తున్నారు. అప్పుడు గుర్తుకురాని కాపు కులం కార్డు.. అంబటిని జైలులో పెట్టగానే ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారా? అంటూ నిలదీస్తున్నారు.

Also Read: Balochistan Clashes: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన ఇద్దరు మహిళలు.. చివరికి!

కాపులపై విమర్శలు మర్చిపోయారా?

Advertisement

ప్రస్తుతం తన తండ్రి కులం గురించి ప్రస్తావిస్తూ పవన్ సాయం కోరుతున్న అంబటి మౌనిక.. గతంలో కాపులను మీ తండ్రి తిట్టినప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉండిపోయారని నిలదీస్తున్నారు. వైసీపీ హయాంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అంబటి.. కాపు సమాజం బుద్ది లేని వారు, మందు తాగేవారని, అధికంగా మాంసాహారం తినేవారంటూ అంబటి చేసిన విమర్శలను తాజాగా జనసైనికులు తెరపైకి తీసుకొస్తున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో కాపుల కోసం అంబటి ఒక్క మంచి పని అయినా చేశారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. తాను కాపు పేరు చెప్పుకొని తిరిగే రాజకీయ నేతను కాదంటూ ఓ ఇంటర్వ్యూలో అంబటి స్వయంగా చెప్పుకున్నారని గుర్తుచేస్తున్నారు. మెుత్తంగా గతంలో తనను తీవ్రస్థాయిలో దూషించిన అంబటి కోసం.. ఇప్పుడు పవన్ స్టాండ్ తీసుకోవాలంటూ అంబటి కూతురు మౌనిక చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం లాజిక్ కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలు.. ఉపసంహరణకు చివరి ఛాన్స్, ఇకపై ఏకగ్రీవాలు షురూ!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×