E-Paper
Advertisement

Ambati Rambabu: వ్యాఖ్యల తంటా.. రాజమండ్రి సెంట్రల్ జైలుకి అంబటి రాంబాబు, రెండువారాలు అక్కడే

Ambati Rambabu: వ్యాఖ్యల తంటా.. రాజమండ్రి సెంట్రల్ జైలుకి అంబటి రాంబాబు, రెండువారాలు అక్కడే
Advertisement

Ambati Rambabu: సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది గుంటూరు న్యాయస్థానం. ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు పోలీసులు. ఆయన బెయిల్ కోసం వైసీపీ లీగల్ టీమ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిపై న్యాయస్థానంలో పిటిషన్ వేయనుంది.

రాజమండ్రి సెంట్రల్ జైలుకి అంబటిరాంబాబు

Advertisement

గుంటూరు పట్టణంలో తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంశంపై మహాపాపం పేరుతో టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను 24 గంటల్లో ఫ్లెక్సీ తొలగించాలని టీడీపీ శ్రేణులను హెచ్చరించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ వ్యవహారంపై శనివారం వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసిన తర్వాత అక్కడి నుంచి కారులో వెళ్తుండగా టీడీపీ శ్రేణులు అంబటి వాహనాన్ని అడ్డుకున్నారు.

ఊహించని పరిణామంతో షాకైన అంబటి, కారులో నుంచే సీఎం చంద్రబాబును తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో టీడీపీ శ్రేణులు అంంబటి కారుపై దాడి చేశాయి. ఈ ప్రాంతం నుంచి వెళ్లాలని పోలీసులు అంబటిని సూచించినా వినిపించుకోలేదు. మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ కార్యకర్తలు భగ్గుమన్నారు.

Advertisement

అసభ్యకర వ్యాఖ్యలు కేసు.. రెండువారాల రిమాండ్

ఈ వ్యవహారంపై ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు గుంటూరు సిద్ధార్థనగర్‌లో అంబటి రాంబాబు ఇల్లు, ఆఫీసుపై దాడులు చేశారు, నిప్పుపెట్టారు.  చివరకు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంబటిపై వివిధ పోలీసుస్టేషన్‌లో పీఎస్‌లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేయడంతో శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన్ని అరెస్టు చేశారు. ఈ కేసులో విచారించిన తర్వాత ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో ఆయన్ని గుంటూరు సివిల్ న్యాయమూర్తి ముందు పోలీసులు హాజరుపరిచారు. ఈ క్రమంలో న్యాయమూర్తి ముందు ఇరుపక్షాల వాదనలు జరిగాయి.

ALSO READ: ఆ నిప్పు మీ ప్రభుత్వానికే పెట్టుకున్నారు.. ఏపీలో నడుస్తోంది జంగిల్‌ రాజ్.. 

అంబటి తరపున పొన్నవోలు తన వాదనలు వినిపించారు. అంబటి రాంబాబు ఎలాంటి నేరం చేయలేదన్నారు. ఆయనపై నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం ఏడేళ్లు జైలుశిక్ష పడే అవకాశం ఉన్నందున ఆయనకు రిమాండ్ విధించవద్దని కోరారు. అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 16 కేసులు నమోదు అయ్యాయని, వాటిలో మాగ్జిమమ్ కేసులు అసభ్యకర వ్యాఖ్యలు, పోలీసు విధులకు ఆటంకం కలిగించినవేనని పోలీసుల తరపు న్యాయవాదులు తెలిపారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో అంబటిని విడుదల చేస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందని వివరించారు. ఆయన్ని పోలీసు కస్టడీకి తీసుకునే అవకాశం ఉందని, రిమాండ్ విధించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత రాత్రి 11.30 గంటల సమయంలో న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. 14 రోజులపాటు ఆయనకు రిమాండ్ విధించారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపాలని అంబటి కోరడంతో న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. చివరకు ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×