E-Paper
Advertisement

Ramakrishna Reddy: 2500 కోట్ల అవినీతి.. చంద్రబాబు, పవన్‌పై ఆర్కే సంచలన వ్యాఖ్యలు!

Ramakrishna Reddy: 2500 కోట్ల అవినీతి.. చంద్రబాబు, పవన్‌పై ఆర్కే సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Ramakrishna Reddy: మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఇతరులపై చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు రూపకల్పనలో దాదాపు రూ.2వేల 500 కోట్ల భారీ కుంభకోణం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్ ఒక పక్కా ప్రణాళిక ప్రకారం అలైన్‌మెంట్‌ను మార్చారని ఆయన ఆరోపించారు. తమకు కావాల్సిన వారికి.. ముఖ్యంగా లింగమనేని గ్రూపునకు చెందిన భూముల విలువ పెంచేలా ఈ మార్పులు చేశారని ఆయన పేర్కొన్నారు.

Advertisement

ఈ అలైన్‌మెంట్ మార్పుకు ప్రతిఫలంగా లింగమనేని రమేశ్ నుంచి చంద్రబాబు కుటుంబానికి లబ్ధి చేకూరిందని ఆర్కే విమర్శించారు. అలైన్‌మెంట్ మార్చినందుకు బదులుగా లింగమనేని కుటుంబం హెరిటేజ్ సంస్థకు భూములను కేటాయించిందని ఆరోపించారు. అత్యంత విలువైన కరకట్టపై ఉన్న ఇంటిని చంద్రబాబుకు లింగమనేని ఉచితంగా ఇచ్చారని ఆయన ధ్వజమెత్తారు. కోట్లాది రూపాయల విలువైన భూమిని కేవలం రూ. 8 లక్షలకే పవన్ కళ్యాణ్‌కు అమ్మడం వెనుక కూడా అంతరార్థం ఉందని ఆయన ఆరోపించారు.

ఈ కేసులో చంద్రబాబు, లోకేశ్, మంత్రి నారాయణ , లింగమనేని రమేశ్‌లకు శిక్ష తప్పదని ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సాక్ష్యాధారాలతో సహా ఈ అవినీతిని నిరూపిస్తామని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: రన్‌వేపై నిలిచిన విమానం.. లోపల ఊపిరాడక ప్రయాణికుల విలవిల!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×