E-Paper
Advertisement

Tirumala : ఆ యాప్ లో తిరుమల సమస్త సమాచారం ..

Tirumala : ఆ యాప్ లో తిరుమల సమస్త సమాచారం ..
Advertisement

Tirumala : తిరుమల దర్శనానికి వెళ్లే భక్తలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఆధునిక సేవలు అందించేందుకు ప్రయత్నిస్తోంది. తిరుమల సమస్త సమాచారం కోసం టీటీడీ ఓ యాప్ ను తీసుకొస్తోంది. తిరుమలకు సంబంధించిన సమాచారం ఈ యాప్‌ ద్వారా తెలుసుకునే అవకాశం భక్తులకు కలుగుతుంది.

తిరుమలకు సంబంధించిన సమస్త సమాచారాన్నీ యాప్‌ ద్వారా అందించేందుకు టీటీడీ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఈ యాప్ అందుబాటులోకి వస్తే శ్రీవారి దర్శన టికెట్లు,సేవలు, వసతి గృహాలను బుక్‌ చేసుకునే అవకాశం కలుగుతుంది. తిరుమల సమాచారమంతా భక్తులకు అందుబాటులో ఉంచేలా ఈ యాప్‌ను రూపొందించే పనిలో ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగం అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే యాప్‌ రూపకల్పన దాదాపు పూర్తైంది. ఈ యాప్ ను త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

గతంలో గోవింద యాప్‌ను టీటీడీ తీసుకొచ్చింది. అయితే ఆ యాప్ పూర్తిస్థాయిలో భక్తులకు ఉపయోగపడలేదు. తాజాగా ఆ యాప్ స్థానంలో కొత్త యాప్‌ రూపొందిస్తున్నారు. దర్శన టోకెన్లను భక్తులు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో టీటీడీ వెబ్‌సైట్‌ ద్వారా బుక్‌ చేసుకుంటున్నారు. కొత్తగా తీసుకొచ్చే యాప్‌ ద్వారా భక్తులు సులభంగా గదులు, శ్రీవారి సేవా టికెట్లను పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. సేవలు జరిగే సమయంలో సుప్రభాతం, తోమాల, అర్చన వంటి వాటిని వినేందుకు వీలుగా ఏర్పాట్లు కూడా ఇందులో చేయనున్నారు. మొత్తంమీద టీటీడీ యాప్ అందుబాటులోకి వస్తే భక్తులకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే యాప్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×