E-Paper
Advertisement

AP National Observer: ఏపీ నేషనల్ అబ్జర్వర్‌గా అదిత స్వప్న.. ప్రకటించిన అఖిల భారత మహిళా కాంగ్రెస్

AP National Observer: ఏపీ నేషనల్ అబ్జర్వర్‌గా అదిత స్వప్న.. ప్రకటించిన అఖిల భారత మహిళా కాంగ్రెస్
Advertisement

AP National Observer: అఖిల భారత మహిళా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ జాతీయ పరిశీలకురాలిగా బి.అదిత స్వప్న నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా ఆదేశాల మేరకు.. ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ జాతీయ అబ్జర్వర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో అదిత స్వప్న బీహార్, పుదుచ్చేరి, అండమాన్ & నికోబార్ దీవులకు జాతీయ పరిశీలకురాలిగా విజయవంతంగా పని చేసిన విషయం తెలిసిందే.

అదిత స్వప్న రియాక్షన్..

తనను అఖిల భారత మహిళా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ జాతీయ పరిశీలకురాలిగా నియమించడంపై అదితా స్వప్న స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నాపై విశ్వాసం ఉంచి, నూతన బాధ్యతను అప్పగించినందుకు అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబాకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు’ అని అన్నారు.

అదే నా లక్ష్యం – అదిత స్వప్న

Advertisement

ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా నాయకత్వంలో.. ఆంధ్రప్రదేశ్‌లో మహిళా కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి, అలాగే రాహుల్ గాంధీ దార్శనికత, నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అదిత స్వప్న తెలిపారు. అంతేకాకుండా.. ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్‌ను రాష్ట్రంలోని ప్రతి మండలం, బూత్ స్థాయికి తీసుకెళ్తానని, ఆంధ్రప్రదేశ్ మొత్తం మహిళా కాంగ్రెస్ ఉనికిని విస్తరించడంపై దృష్టి పెడతానని  ఆమె పేర్కొన్నారు. అలాగే మహిళా నాయకులకు సాధికారత కల్పించడం, సంస్థాగత చట్రాన్ని బలోపేతం చేయడం, రాజకీయాల్లో మహిళల సమాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కోసం అఖిల భారత మహిళా కాంగ్రెస్ తన ప్రయత్నాలను కొనసాగిస్తోందని ఈ సందర్భంగా అదిత స్వప్న తెలిపారు.

Advertisement

 

 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×