E-Paper
Advertisement

Actor Suman: వెంకన్న భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు.. వారిని జైలుకు పంపాల్సిందే..? సుమన్ సంచలన వ్యాఖ్యలు

Actor Suman: వెంకన్న భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు.. వారిని జైలుకు పంపాల్సిందే..? సుమన్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  విశాఖపట్నం పర్యటనలో ఉన్న హీరో సుమన్ తిరుపతి లడ్డూ కల్తీ అంశంపై స్పందిస్తూ.. తాను ఒక సెక్యులర్ వాదినని.. భారతదేశం అనేక కులాలు, మతాలకు నిలయమని పేర్కొన్నారు. అయితే, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రమని అన్నారు. అలాంటి చోట లడ్డూ ప్రసాదం కల్తీ జరగడం ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

లడ్డూ తయారీలో కల్తీ జరిగిందనేది వాస్తవం అయితే, ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకోవాలని సుమన్ కోరారు. ‘కేవలం సస్పెన్షన్లతో సరిపెడితే సరిపోదు. నాకు సంబంధం లేదంటే అసలు కుదరదు. ఆ సమయంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ విచారించాలి. ఇందులో ఏ కులం, ఏ మతం వారైనా సరే.. తప్పు చేసినట్లు తేలితే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

ఈ వివాదంపై పారదర్శకమైన విచారణ జరగాలని సుమన్ సూచించారు. ఇందుకోసం ఒక రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని లేదా ప్రత్యేక అధికారుల బృందాన్ని నియమించి వాస్తవాలను వెలికితీయాలని కోరారు. కల్తీకి కారణమైన వారిని గుర్తించి.. వారికి కఠిన శిక్ష పడేలా చూడటం ద్వారానే భక్తులకు నమ్మకం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

శ్రీవేంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సుమన్ ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయం ఏదైనా కావచ్చు, కానీ భక్తుల నమ్మకం దగ్గర రాజీ పడకూడదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

ALSO READ: Pawan – Lokesh: అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం.. పవన్ కళ్యాణ్‌తో లోకేశ్ భేటి.. కీలక అంశాలపై చర్చ!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×