E-Paper
Advertisement

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. బీఎస్సీ అగ్రికల్చర్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్, కేవల ఐదు రోజులు మాత్రమే

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. బీఎస్సీ అగ్రికల్చర్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్, కేవల ఐదు రోజులు మాత్రమే
Advertisement

BSc Agriculture Admissions: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ నాలుగేళ్ల అగ్రికల్చర్‌ కోర్సు ప్రవేశాల నోటిఫికేషన్ వెలువడింది. అగ్రిసెట్‌-2026 పేరిట ప్రవేశ పరీక్షనిర్వహిస్తోంది. కంప్యూటర్ ద్వారా ఈ పరీక్ష జరగనుంది. ఆంగ్రూలో అగ్రికల్చర్‌, సీడ్‌ టెక్నాలజీ, ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ డిప్లొమా పూర్తి చేసిన, పూర్తి చేయనున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్థులకు బిగ్ అలర్ట్ –అభ్యర్థులు రెండేళ్ల డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌, సీడ్‌ టెక్నాలజీ, ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 2025-26 సంవత్సరంలో డిప్లొమా పూర్తి చేయనున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తాము పూర్తి చేసిన డిప్లొమా విభాగానికి సంబంధించి అగ్రిసెట్‌ ఎంట్రన్స్ పరీక్ష రాయాల్సివుంటుంది. 17 నుంచి 22 ఏళ్లు మాత్రమే అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 25 ఏళ్లు, దివ్యాంగులకు 27 ఏళ్లు మించరాదు.

Advertisement

బీఎస్సీ అగ్రికల్చర్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్- ఆంగ్రూ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించిన తర్వాత ప్రింట్‌తో పాటు అవసరమైన పత్రాలను రిజిస్టర్డ్ పోస్టు ద్వారా కన్వీనర్‌కు పంపాలి. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో జరుగుతుంది. మొత్తం 120 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. పరీక్ష వ్యవధి గంటా 30 నిమిషాలు.

కేవలం ఐదురోజులు మాత్రమే-ఎలాంటి నెగటివ్ మార్కింగ్ లేదు, ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. జూలై 27 తో దరఖాస్తు గడువు ముగియనుంది. ఆలస్య రుసుముతో 28 నుంచి 31 వరకు ఉంటుంది. హార్డ్ కాపీ ఆగష్టు మూడులోగా చేరాలి. ఆ తర్వాత ఎంట్రన్స్ ఎప్పుడనేది ప్రకటిస్తారు.

Advertisement

ALSO READ:  ఢిల్లీలో సీఎం చంద్రబాబు, మోదీ-షాతో కీలక సమావేశం, రాత్రికి అక్కడే మకాం

ఆంగ్రూ అగ్రిసెట్‌-2026 ద్వారా బీఎస్సీ-ఆనర్స్‌ అగ్రికల్చర్‌ ప్రవేశాలకు సంబంధించి సీట్లను ఒక్కసారి పరిశీలిద్దాం. డిప్లొమా వారీగా సీట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అగ్రికల్చర్‌ విభాగంలో 282 సీట్లు, సీడ్‌ టెక్నాలజీ-11, ఆర్గానిక్‌ ఫార్మింగ్‌-04 ఉన్నాయి. మొత్తం సీట్లు 297. బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌, డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌, డిప్లొమా ఇన్‌ సీడ్‌ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ వంటి విభాగాలు ఉంటాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×