E-Paper
Advertisement

Chandrababu Convoy: కాన్వాయ్ వెంట పరుగులు తీసిన మహిళ.. కారు ఆపి మాట్లాడిన చంద్రబాబు!

Chandrababu Convoy: కాన్వాయ్ వెంట పరుగులు తీసిన మహిళ.. కారు ఆపి మాట్లాడిన చంద్రబాబు!
Advertisement

Woman Ran Along The Convoy to See Chandra Babu: ఎన్డీఏ పక్ష నాయకుడిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడిని చూసేందుకు కాన్వాయ్ వెంట ఓ మహిళ పరుగులు తీసింది. ఇది గమనించిన చంద్రబాబు తన కాన్వాయ్ ను ఆపి ఆమెతో ఆప్యాయంగా మాట్లాడారు. ‘నాకు జ్వరం వచ్చినా మీరు వస్తున్నారని తెలిసి.. మిమ్మల్ని చూసేందుకు వచ్చాను సార్’ అంటూ ఆ మహిళ చెప్పడంతో చలించిపోయారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి, అవసరమైన వైద్య సదుపాయం అందేలా చూడాలని పార్టీ నేతలకు బాబు సూచించారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

నగరంలోని ఏ-కన్వెన్షన్‌ హాలులో కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు హాజరయ్యారు. బాబును చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు ఉండవల్లికి ప్రయాణమయ్యారు. బాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఆ మహిళను కారులోంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ను ఆపి మరి, ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు. తనది మదనపల్లి అని, తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబుతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది. మీపై ఉన్న అభిమానంతో చూడడానికి వచ్చానంటూ చంద్రబాబుకు చెబుతూ ఆనందం వ్యక్తం చేసింది. తనను చూసి ఎమోషన్ అయిన ఆ మహిళతో చంద్రబాబు మాట్లాడారు. సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. ‘మా కష్టం ఫలించి.. మా కోరిక మేరకు మీరు సీఎం అయ్యారు సార్.. ఒక్కసారి మీ కాళ్లు మొక్కుతాను’ అంటూ ఆ మహిళ అనగా.. చంద్రబాబు సున్నితంగా వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫొటో తీసుకున్నారు.

Advertisement

Also Read: చిరంజీవికి ప్రత్యేకంగా చంద్రబాబు ఇన్విటేషన్, సాయంత్రం విజయవాడకు..

‘నాకు జ్వరం వచ్చినా మిమ్మల్ని చూసేందుకు వచ్చాను సార్’ అంటూ చంద్రబాబుతో ఆ మహిళ చెప్పగా.. చలించిపోయిన చంద్రబాబు ముందు ఆసుపత్రికి వెళ్లమ్మ అంటూ సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని, అవసరమైన వైద్యం సాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×