E-Paper
Advertisement

Anantapur News: అడ్డంగా బుక్కైన ఓ యువకుడు.. ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అంటూ పోస్ట్‌, కొత్త చిక్కులు

Anantapur News: అడ్డంగా బుక్కైన ఓ యువకుడు.. ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అంటూ పోస్ట్‌, కొత్త చిక్కులు
Advertisement

Anantapur News: రాత్రికి రాత్రే సెలబ్రిటీ కావాలన్న ఆశతో పని పాటా లేని కొందరు వ్యక్తులు.. సోషల్‌మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు. సెలబ్రిటీ పొజిషన్ ఏమోగానీ పోలీసులకు అడ్డంగా చిక్కుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాకి చెందిన ఓ యువకుడు అలాగే బుక్కైపోయాడు. ఇంతకీ మేటర్ ఏంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

అడ్డంగా బుక్కైన అనంతపురం జిల్లా యువకుడు

Advertisement

సోషల్‌మీడియా ప్రబలంగావున్న ఈ రోజుల్లో రాత్రికి రాత్రి సెలబ్రిటీ కావాలని కొందరు యువకులు భావిస్తున్నారు. సక్సెస్ అవుతున్నారు కొందరు. మరికొందరైతే రకరకాల కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇంకొందరు తమ ప్రాణాలను పొగొట్టుకున్న సందర్భాలు లేకపోలేదు. అలాంటి పిచ్చి పని చేశాడు ఓ యువకుడు.

సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ కావడంతో అతడిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.నంతపురం జిల్లా నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ అనే యవకుడు స్వతహాగా హిందువు.  కొన్నాళ్ల కిందట ఇస్లాం స్వీకరించాడు. ధనుంజయ్ పేరును షేక్ మహ్మద్ ఆసిఫ్‌గా మార్చుకున్నాడు.

Advertisement

మతం మారి.. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ 

ఇందులో తప్పేమీ లేదు. కాకపోతే ‘పాకిస్తాన్’కు అనుకూలంగా అతడు పోస్టు చేసిన వీడియో వైరల్ అయ్యింది. ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అంటూ వీడియో స్పష్టంగా వినిపిస్తోంది. ఈ వ్యవహారం చివరకు సొంత జిల్లావాసులను కంటపడింది. ధనుంజయ్ చేసిన పోస్టు ముమ్మాటికీ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని అంటున్నారు.

అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నల్లచెరువు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు కొందరు యువకులు. ప్రస్తుతం వీడియోను పరిశీలిస్తున్నారు.  దీని తర్వాత యువకుడ్ని విచారించనున్నారు. ఆ తర్వాత సరదాగా అన్నాడా? లేక నిజంగా అన్నాడా నిర్ధారించుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నారు పోలీసులు.  సోషల్ మీడియా పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పదేపదే పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ALSO READ: రసవత్తరంగా సింహపురి సిటీ పాలిటిక్స్.. కొత్త మేయర్‌గా రూప్‌కుమార్

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×