E-Paper
Advertisement

Sankranti Special Food: సంక్రాంతి పండగ మర్యాదలు.. కొత్త అల్లుడికి 158 వంటకాల విందు

Sankranti Special Food: సంక్రాంతి పండగ మర్యాదలు.. కొత్త అల్లుడికి 158 వంటకాల విందు
Advertisement

Sankranti Special Food: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు అల్లుడికి మర్యాదలు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఈ విషయంలో గోదారోళ్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అతిథి మర్యాదకు పెట్టింది పేరు ఉభయగోదావరి జిల్లాలు. సంక్రాంతికి వచ్చిన కొత్త అల్లుడికి 158 వంటకాలతో పసందైన విందు భోజనం వడ్డించారు అత్తింటివారు. వాటిని చూసి ఆశ్చర్యపోవడం అల్లుడి వంతైంది. ఇంతకీ ఎక్కడో తెలుసా?

సంక్రాంతి పండగ  అతిథి మర్యాదలు

Advertisement

నార్మల్‌గా అల్లుడు అత్తింటికి వస్తే ఆ మర్యాదలు వేరు. అలాంటి సంక్రాంతి సమయంలో చెప్పాల్సిన అవసరం లేదు. మర్యాదలు, కానుకలు, వడ్డింపులు ఆ రేంజ్‌లోనే ఉంటాయి. గోదారి జిల్లాలను మరిపించేలా తెనాలికి చెందిన ఓ కుటుంబం కొత్త అల్లుడికి అదిరిపోయేలా ఆతిథ్యం ఇచ్చింది. ఏకంగా 158 రకాల వంటకాలతో అదిరిపోయే విందు భోజనం ఇచ్చారు.

తెనాలికి చెందిన మురళీకృష్ణ-మాదవీలత దంపతులు. తన కూతురు మౌనికను రాజమండ్రికి చెందిన శ్రీదత్తకు వివాహం జరిపించారు. మ్యారేజ్ తర్వాత వచ్చిన తొలి సంక్రాంతి పండగ కావడంతో అల్లుడికి కళ్లు చెదిరే విందు ఏర్పాటు రెడీ చేశారు. గోదారివాసులకు ఏ మాత్రం తీసిపోని విధంగా పసందైనవంటలు, ఫలహారాలు, పండ్లతో వడ్డించి ఆశ్చర్య పరిచారు.

Advertisement

కొత్త అల్లుడికి 158 వంటకాలతో పసందైన విందు

అత్తమామలు డైనింగ్ టేబుల్‌పై 158 రకాల వంటకాలు వడ్డించి అల్లుడ్ని ముంచెత్తారు. బూరెలు, గారెలు, బొబ్బట్లు, అరిసెలు లాంటి సంప్రదాయ పిండివంటకాలు మాత్రమే కాదు, రకాల స్వీట్లు, పచ్చళ్లు దర్శనమిచ్చాయి. వాటిని చూసి కొత్త అల్లుడు షాకయ్యాడు. మా ఆచారాలకు తగ్గట్టుగా ఏ మాత్రం తీసిపోని విధంగా చేయడం చూసి ఆశ్చర్యపోయాడు.

ALSO READ: మకర సంక్రాంతి నేడు.. కళకళలాడుతున్న పల్లెటూర్లు

అల్లుడికి వంటకాల విషయంలో ఆ రికార్డు అలాగే ఉంది. రెండేళ్ల కిందట అనకాపల్లికి చెందిన మురళీకి ఏలూరుకి చెందిన భీమారావు-చంద్రలీల దంపతులు తమ కూతుర్ని ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లైన తర్వాత వచ్చిన తొలి సంక్రాంతికి కూతురు-అల్లుడు రావడంతో ఊహించని రీతిలో అతిథి మర్యాదులు చేశారు. ఏకంగా 379 రకాల వంటకాలు చేశారు. ఇప్పటికే ఆ రికార్డు అలాగే ఉందని కొందరు చెబుతున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×