E-Paper
Advertisement

Kurnool : పిల్లాడి ప్రాణాల మీదికి తెచ్చిన సంప్రదాయం.. నోట్లో చేప ఇరుక్కుని..

Kurnool : పిల్లాడి ప్రాణాల మీదికి తెచ్చిన సంప్రదాయం.. నోట్లో చేప ఇరుక్కుని..
Advertisement

Kurnool : ఓ సంప్రదాయం నాలుగు నెలల బాలుడి ప్రాణాలకు ముప్పు తెచ్చింది. ఈ ఘటన కర్నూల్ జిల్లా ఆదోని పట్టణంలోని కౌడల్‌పేట కాలనీలో శనివారం చోటు చెసుకుంది. కౌడల్‌పేట కాలనీకి చెందిన బందే నవాజ్‌, మోహమ్మది అనే దంపతులకు నాలుగు నెలల బాలుడు ఉన్నాడు. సంప్రదాయం ప్రకారం పిల్లాడి పెదవులకు చేపను తాకిస్తే ఆరోగ్యంగా ఉంటారని ఆ కుటుంబ సభ్యుల నమ్మకం.

శనివారం బాలుడి పెదవులకు చేపను తాకించే ప్రయత్నం చేశారు.చేతిలో ఉన్న చేప జారి పిల్లాడి నోట్లోకి వెళ్లిపోయింది. పిల్లాడి నోట్లో చేప ఇరుక్కుపోవడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి అపస్మారక స్థితికి వెళ్లాడు. తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతికష్టం మీద గొంతులో ఇరుక్కున్న చేపను బయటకు తీశారు. దీంతో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×