E-Paper
Advertisement

Road Accident: ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్ వాసుల మృతి..

Road Accident: ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్ వాసుల మృతి..
Advertisement

Allagadda Road AccidentAllagadda Road Accident(Andhra pradesh today news): నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ నల్లగట్ల వద్ద హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

తిరుమల దైవ దర్శనం కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుల్లో నవ దంపతులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ వెంకటాపురానికి చెందిన మంత్రి రవీందర్ కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో ఆళ్ళగడ్డ మండలం నల్లగట్ల వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని రవీందర్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మంత్రి రవీందర్, అతని భార్య లక్ష్మి, కుమారుడు కిరణ్, కోడలు కావ్య, ఇంకో కుమారుడు ఉదయ్ కిరణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

కాగా మంత్రి రవీందర్ కుమారుడు కిరణ్‌కు కావ్యతో ఫిబ్రవరి 29న తెనాలిలో పెళ్లి జరిపించారు. మార్చి 3న హైదరాబాద్‌లోని శామీర్‌పేట్‌లో రిసెప్షన్ చేశారు. నూతన దంపతులను తీసుకొని తిరుమలకు వెళ్లివస్తుండగా ఈ ఘోరం జరిగింది. దీంతో మంత్రి రవీందర్ ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×