E-Paper
Advertisement

ఇచ్ఛాపురంలో భారీగా గంజాయి స్వాధీనం.. ఒడిశా ముఠా అరెస్ట్!

ఇచ్ఛాపురంలో భారీగా గంజాయి స్వాధీనం.. ఒడిశా ముఠా అరెస్ట్!
Advertisement

Ganja Seizure: శ్రీకాకుళం జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఇచ్చాపురం రైల్వే స్టేషన్‌లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి చిక్కింది. అక్రమంగా తరలిస్తున్న 34 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, దీని వెనుక ఉన్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.

ఒడిశా నుంచి సూరత్‌కు అక్రమ రవాణా

Advertisement

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన అనిల్ కుమార్ గౌడో, మునా ప్రధాన్ అనే ఇద్దరు వ్యక్తులు భారీ స్థాయిలో గంజాయిని ఒడిశా నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు తరలించేందుకు పథకం వేశారు. రైలు మార్గంలో వెళ్లేందుకు ఇచ్చాపురం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న వీరి ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వారి బ్యాగులను పరిశీలించగా గుట్టుచప్పుడు కాకుండా దాచిన 34 కిలోల గంజాయి బయటపడింది.

రిమాండ్‌కు తరలింపు

Advertisement

పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 34 కిలోల గంజాయితో పాటు వారి వద్ద ఉన్న రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన ఇచ్చాపురం పోలీసులు, నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

నిఘా తీవ్రం.. హెచ్చరిక

సరిహద్దు ప్రాంతాల్లో అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణాపై నిఘాను మరింత కట్టుదిట్టం చేశామని పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని, ఎవరినీ విడిచిపెట్టేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Also Read: ఎర్రబస్సు అన్నోడికి… ఎయిర్‌బస్ క్రెడిటా? జగన్‌పై విరుచుకుపడ్డ ఎంపీ కలిశెట్టి!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×