E-Paper
Advertisement

Worms In Chocolet Incident: చాక్లెట్‌లో బతికున్న పురుగులు!

Worms In Chocolet Incident: చాక్లెట్‌లో బతికున్న పురుగులు!
Advertisement

Worms In Chocolet Incident: మేడిపండూ చూడు మేలిమై ఉండును.. పొట్టవిప్పి చూడ పురుగులుండు.. ఇప్పుడు ఈ వేమన శతకం ఎందుకు గుర్తు చేస్తున్నట్టు అనుకుంటున్నారా.. పాపులర్‌ ఖరీదైన బ్రాండ్‌ డార్క్‌ చాకోలేట్.. అంతకంటే పాపులర్‌ మార్ట్‌లో కొనుక్కుని తీరా తిందామనే సరికి ఆ చాకోలేట్‌లో పురుగులు కనిపించాయి. అందుకే ఈ వేమన శతకం గుర్తుకొచ్చింది.

చాక్లెట్లో పురుగులు..
హైదరాబాద్‌ గుడిమల్కాపూర్‌లోని రిలయన్స్‌ స్మార్ట్‌లో.. ఓ యువతి ఖరీదైన హార్ష్‌లే డార్క్‌ చాకోలేట్‌ కొనుక్కుంది. తీరా తినేద్దామని చాకోలేట్‌ కవర్‌ విప్పి చూడగా.. అందులో సజీవంగా పాకులాడే పురుగులను కనిపించడంతో షాక్‌ అయింది. ఇదేంటని రిలయన్స్‌ స్మార్ట్‌ యాజమాన్యాన్ని నిలదీస్తే.. యువతిపై దాడికి దిగింది రిలయన్స్‌ యాజమాన్యం. దాడిని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించేందుకు ట్రై చేస్తే.. దౌర్జన్యం చేసి ఫోన్‌ లాక్కోడానికి ట్రై చేశారు. జరిగిన ఈ ఘటనపై గుడిమల్కాపూర్‌ పోలీసులకు బాధిత యువతి ఫిర్యాదు చేసింది.

Advertisement

యాజమాన్యాన్ని ప్రశ్నించిందని దాడి
అయితే ఆ యువతి చాక్లెట్‌లో పురుగు ఉంది అని యాజమాన్యాన్ని నిలదీయగా అదే షాపులోని ముగ్గురు వ్యక్తులు ప్రవీణ్, DM, నాపై దాడికి దిగారు అని తెలిపింది. చాక్లెట్‌లో పురుగు ఉంది అని అడగడం తప్పా.. దీనికే దాడికి పాల్పడతారా? ఇలా అడగటం వల్ల ఒక ఆడపిల్లని అనరాని మాటలు అంటారా? ఇదేక్కడి న్యాయం.. రిపోర్టర్ అయిన నాపైనే ఇలా దాడి చేస్తే సామాన్య కస్టమర్లపై ఇంకెంత దాడి చేస్తున్నారో అని ఆ యువతి ఆందోళన తెలిపింది.

Also Read: భారీగా పడిపోనున్న బంగారం.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Advertisement

ప్రాణాలు తీసే చాక్లెట్..
చాక్లెట్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే.. చిన్న పిల్లలకు అయితే మరి ఎక్కువ ఇష్టం.. అలాంటిది వాటిలో ఇలా పురుగులు వస్తే ప్రజల ఆరోగ్యం ఏమవ్వాలి. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారా? దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×