E-Paper
Advertisement

Doctor Saves Dog: కుక్కకు సర్జరీ.. ఢిల్లీ నుంచి ఫ్లైట్‌లో వచ్చిన డాక్టర్, విశాఖలో అరుదైన ఘటన

Doctor Saves Dog: కుక్కకు సర్జరీ.. ఢిల్లీ నుంచి ఫ్లైట్‌లో వచ్చిన డాక్టర్, విశాఖలో అరుదైన ఘటన
Advertisement

Doctor Saves Dog: జంతువుల పట్ల ఉన్న ప్రేమకు, ప్రస్తుత కాలంలో అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య సాంకేతికతకు అద్దం పట్టే ఓ అరుదైన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. ప్రాణం ఏదైనా విలువైనదే అని నిరూపిస్తూ.. తన పెంపుడు కుక్కను కాపాడుకోవడానికి ఓ యజమాని చేసిన ప్రయత్నం.. అందుకు ఢిల్లీ నుంచి తరలివచ్చిన వైద్యుడి సేతలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

విశాఖపట్నానికి చెందిన ఓ వ్యక్తి గోల్డెన్ రిట్రీవెర్ జాతికి చెందిన కుక్కను ఎంతో ప్రాణప్రదంగా పెంచుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఆ కుక్క ఆహారం తీసుకోకుండా తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆందోళన చెందిన యజమాని స్థానిక వెటర్నరీ వైద్యులను సంప్రదించి ఎక్స్‌రే తీయించగా.. అసలు విషయం బయటపడింది. ఆ కుక్క పొట్టలో దారపు ఉండతో పాటు ఒక సూది కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

Advertisement

సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో శస్త్రచికిత్స (Surgery) చేసి వాటిని తొలగిస్తారు. కానీ.. ఆ కుక్కకు ప్లేట్లెట్స్ సంఖ్య గణనీయంగా పడిపోవడంతో సర్జరీ చేయడం ప్రాణాపాయంగా మారింది. కత్తితో కోత కోయకుండా ఆ వస్తువులను బయటకు తీయడం ఒక్కటే మార్గమని వైద్యులు భావించారు. ఇందుకోసం ఎండోస్కోపీ విధానం ఉత్తమమని నిర్ణయించారు.

విశాఖలో ఆ సమయంలో ఆ నిపుణులు అందుబాటులో లేకపోవడంతో.. యజమాని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఢిల్లీలోని ఓ ప్రముఖ వెటర్నరీ స్పెషలిస్ట్‌ను సంప్రదించారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న సదరు డాక్టర్.. కేవలం ఒక మూగజీవిని కాపాడటం కోసం ఢిల్లీ నుంచి విమానంలో హుటాహుటిన విశాఖకు చేరుకున్నారు.

Advertisement

డాక్టర్ విశాఖ చేరుకున్న వెంటనే తన బృందంతో కలిసి చికిత్స ప్రారంభించారు. ఎండోస్కోపీ పరికరాల సహాయంతో కుక్క పొట్టలో చిక్కుకుపోయిన దారపు ఉండను, సూదిని సుమారు 45 నిమిషాల పాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. ఎటువంటి సర్జరీ లేకుండానే ఆ కుక్క ప్రాణాలను కాపాడటంతో యజమాని ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆ గోల్డెన్ రిట్రీవెర్ కోలుకుంటోంది. యజమాని చూపిన బాధ్యత, వైద్యుడి సమయస్ఫూర్తిని చూసి జంతు ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: ఇంత ఘోరమా.. మూడేళ్ల చిన్నారిని చితకబాదిన అంగన్‌వాడి టీచర్

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×