E-Paper
Advertisement

Roti Spits Video: ఛీ.. ఛీ.. రోటీలపై ఉమ్మేసి.. యూపీ రెస్టారెంట్ లో అసహ్యం

Roti Spits Video: ఛీ.. ఛీ.. రోటీలపై ఉమ్మేసి.. యూపీ రెస్టారెంట్ లో అసహ్యం
Advertisement

Roti Spits Video: ప్రస్తుత బిజీ లైఫ్ లో బయటి ఫుడ్ కు తినడం ఎక్కువైంది. వర్క్ బిజీతో బయట ఫుడ్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే రెస్టారెంట్ లో ఆహారం తయారీపై ఓ అసహ్యమైన వీడియో వైరల్ అవుతుంది. ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లోని ఓ రెస్టారెంట్లలో రోటీలు తయారు చేసే వ్యక్తి వాటిపై ఉమ్మి వేస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్లు, చిన్న ఫుడ్ స్టాల్స్ లలో ఆహార పరిశుభ్రతపై మరోసారి సందేహాలు తలెత్తుతున్నాయి.

వీడియో వైరల్.. నిందితుడు అరెస్ట్

ఈ వీడియో ఘజియాబాద్‌లోని ఎ-వన్ చికెన్ పాయింట్ అనే రెస్టారెంట్ లో తీసిందని తెలుస్తోంది. ఈ ఫుటేజీలో ఓ వర్కర్ రోటీలను తయారు చేసి, వాటిపై ఉమ్మివేసి ఆ తర్వాత వాటిని కుంపటిలోపల కాలుస్తు్న్నాడు. వర్కర్ ను గమనించిన ఓ వ్యక్తి రహస్యంగా రికార్డు చేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ అయింది. ఈ వీడియో పోలీసులు దృష్టికి వెళ్లడంతో వెంటనే వారు రంగంలోకి దిగారు. నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Advertisement

బయటి ఫుడ్ పై ఆందోళన

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. రెస్టారెంట్లు, ఫుడ్ స్టాల్స్ లో ఆహార పదార్థాల తయారీపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయట తినడంపై అసహ్యం కలిగేలా ఈ వీడియో ఉందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మరికొందరు డిమాండ్ చేస్తు్న్నారు. మన దేశంలో ఆహార పరిశుభ్రత విషయంలో ఎప్పుడో రాజీపడిపోయామని మరికొందరు అంటున్నారు.

Advertisement

జనవరి 8న మధుబన్ బాపుధామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వర్ధమానపురం అవుట్‌పోస్ట్ దృష్టికి ఈ వీడియో వచ్చిందని ఏసీపీ సూర్యబలి మౌర్య తెలిపారు. ఈ క్లిప్‌లో రోటీల తయారు చేసే వ్యక్తి రోటీలపై ఉమ్మి వేస్తున్నట్లు ఉంది. ఈ వీడియోను పరిశీలించగా.. ఆరోపణలు వాస్తవమని తేలింది. వెంటనే నిందితుడిని అరెస్టు చేశామని ఏసీపీ తెలిపారు.

Also Read:  సీటు కోసం బస్సులో రచ్చ రచ్చ.. జుట్టు పట్టుకుని కొట్లాడుకున్న వీడియో మీరూ చూసేయండి!

ఇలాంటి ఘటనలు

ఈ ఘటనతో రెస్టారెంట్లు, హోటళ్లు, చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ లో ఆహార పరిశుభ్రతపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. గతంలోనూ ఈ తరహా వీడియోలు వైరల్ అయ్యాయి. చట్నీ బల్లి, బిర్యానీలో బొద్దింక అంటూ నిత్యం ఏదొక చోట ఆహారం విషయంలో ఫిర్యాదులు వస్తూనే ఉంటున్నాయి. ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న సమయంలో..ఒకటి రెండు రోజులు ఫుడ్ ఇన్ స్టెక్టర్లు హడావుడి చేస్తారని, ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయిపోతారని నెటిజన్లు అంటున్నారు. ఫుడ్ ఇన్ స్టెక్టర్లు తరచుగా తనిఖీలు చేస్తే ఇలాంటి దారుణాలు తగ్గుతాయని ఆహార ప్రియులు కోరుతున్నారు.

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×