E-Paper
Advertisement

Viral Video: భవిష్యత్ ఆధ్యాత్మిక గురువా?.. వైరల్ అవుతున్న ‘చిన్నారి బాబా’ బిజినెస్ ప్లాన్

Viral Video: భవిష్యత్ ఆధ్యాత్మిక గురువా?.. వైరల్ అవుతున్న ‘చిన్నారి బాబా’ బిజినెస్ ప్లాన్
Advertisement

Viral Video: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక చిన్నారికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. కేవలం 10 రూపాయలకే “దైవ ఆశీస్సులు” అందజేస్తున్న ఈ బాలుడి వ్యాపార తెలివితేటలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సుమారు పదేళ్ల లోపు వయసున్న ఈ బాలుడు, ఒక శివలింగాన్ని తాకి, ఆ పవిత్ర శక్తిని కింద వేచి ఉన్న భక్తులకు బదిలీ చేస్తున్నట్లు నటిస్తూ ప్రతి ఒక్కరి వద్ద 10 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఈ 25 సెకన్ల వీడియో క్లిప్ సమాజంలోని మత విశ్వాసాలను ఒక వ్యాపారంగా మార్చుకున్న తీరును అద్దం పడుతోంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆ బాలుడిని “ఫ్యూచర్ బాబా” అని అభివర్ణిస్తుంటే, మరికొందరు సమాజంలోని అమాయకత్వాన్ని వాడుకోవడంలో వాడు ఆరితేరాడని కామెంట్ చేస్తున్నారు. “10 రూపాయలు ఇవ్వండి.. దీవెనలు తీసుకోండి” అనే ఈ బిజినెస్ ప్లాన్ అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియా యూజర్లు సెటైర్లు వేస్తున్నారు. భారతదేశంలో మతపరమైన నమ్మకాలతో డబ్బు సంపాదించడం ఎంత సులభమో ఈ చిన్నారి నిరూపించాడని, భవిష్యత్తులో వాడు గొప్ప పారిశ్రామికవేత్త లేదా ఆధ్యాత్మిక గురువు అయ్యే అవకాశాలు ఉన్నాయని నెటిజన్లు చమత్కరిస్తున్నారు.

Advertisement

అయితే, ఈ ఘటనపై కొంతమంది ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే ఆధ్యాత్మికతను వ్యాపార కోణంలో చూడటం సమాజ స్థితిగతులకు నిదర్శనమని వారు అభిప్రాయపడుతున్నారు. ఆ బాలుడి తెలివితేటలను సరైన విద్య వైపు మళ్లిస్తే దేశానికి ఉపయోగపడతాడని, లేదంటే తప్పుడు మార్గంలో వెళ్లే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. ఏది ఏమైనా, “డిమాండ్ పెరిగితే ధర కూడా పెరుగుతుంది” అనే ఆర్థిక సూత్రాన్ని ఈ చిన్నారి అప్పుడే వంటబట్టించుకున్నాడంటూ వస్తున్న కామెంట్లతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×