E-Paper
Advertisement

Mermaid Skeleton: బీచ్ లో మత్స్యకన్య అస్థిపంజరం, భారీ ప్రళయం తప్పదా?

Mermaid Skeleton: బీచ్ లో మత్స్యకన్య అస్థిపంజరం, భారీ ప్రళయం తప్పదా?
Advertisement

Viral News: ప్రకృతి ప్రళయానికి ముందు అనేక సంకేతాలు కనిపిస్తాయి. జరగబోయే చెడును ముందుగానే తెలియజేసే  ఘటనలు జరుగుతుంటాయి. వాటిని నిపుణులు మాత్రమే పసిగట్టే అవకాశం ఉంటుంది. లేదంటే. దశాబ్దాలుగా అక్కడే నిసాసం ఉంటున్న స్థానికులు ఈ విషయాలను అంచనా వేస్తుంటారు. తాజాగా యూకేలోనూ ఇలాంటి ఓ వింత ఘటన జరిగింది. జలకన్య అస్థిపంజరం బీచ్ లోకి కొట్టుకొచ్చింది. ఈ అస్థి పంజరం జరగబోయే చెడును సంకేతంగా స్థానికులు అంచనా వేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంతో వణికిపోతున్నారు.

బీచ్ లో వింత ఆకారాన్ని చూసిన జంట

Advertisement

తాజాగా యూకే బీచ్ లో నడుచుకుంటూ వెళ్తున్న ఓ జంట వింత ఆకారాన్ని చూశారు. మనిషికి రెక్కలు ఉన్నట్లుగా కనిపించింది. దానికి చేపలా తోక కూడా ఉండటాన్ని గమనించారు. వింతైన ఈ అస్థిపంజరాన్ని చూసి వెంటనే ఫోటోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. పౌలా రీగన్ అనే తాజాగా తన భర్తతో డేవ్ తో కలిసి బీచ్‌లో వాకింగ్ కు వెళ్లింది. సరదాగా నడుస్తుండగా, కొద్ది దూరంలో ఓ వింత ఆకారం కనిపించింది. వెళ్లి చూసి షాకయ్యారు. దగ్గరకు వెళ్లి చూస్తే,  తల భాగం అస్థిపంజరంలా, వెనుక భాగం చేప తోకలా ఉందని వెల్లడించింది.  తన జీవితంలో ఎప్పుడూ అలాంటి ఆకారాన్ని చూడలేదని చెప్పింది. ముందుగా ఆ ఆకారాన్ని చూసి ఒడ్డుకు కొట్టుకొచ్చిన చెక్క అని భావించినట్లు చెప్పింది. కానీ, దగ్గరకు వెళ్లి చూస్తే వింత ఆకారం దర్శనం ఇచ్చిందని చెప్పింది. ఆ ఆకారం కూడా కుళ్లిపోయినట్లు కనిపించడం లేదని వివరించింది. తాము అక్కడకి వెళ్లి చూస్తుండగానే మరికొంత మంది అక్కడికి వచ్చారని చెప్పింది పౌలా. చాలా మంది ఆ వింత రూపాన్ని చూసినా కచ్చితంగా ఏంటో చెప్పలేకపోయారని వివరించింది. గతంలో ప్రళయానికి ముందు ఈ బీచ్ లో ఇలాంటి ఘటనలు జరిగినట్లు స్థానికులు చెప్తున్నారని చెప్పింది. అక్కడి వాళ్లు జరగబోయే చెడుకు సంకేతంగా భావిస్తున్నారని పౌలా వెల్లడించింది.

Advertisement

Read Also:  సిమెంట్ వాడకుండానే ఇల్లు కట్టేశారు.. ఎలాగో తెలిస్తే దిమ్మతిరుగుద్ది!

సోషల్ మీడియాలో చర్చోప చర్చలు

ఈ వింత రూపాలను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది నిజంగానే జలకన్య ఆస్థి పంజరం అని కొందరు అంటుంటే, అదంతా ఉత్త ముచ్చటేనని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. “ఇది నిజంగా జలకన్య ఆస్థిపంజరమా?” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ఇది ఎవరో కావాలని చేసినట్లు కనిపిస్తోంది. ఎక్కడైనా ముక్కు, చెవులు కూడా ఎముకలతో ఉంటాయా?” అని మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు. ఈ వింత ఆకారంపై సోషల్ మీడియాలో రకరకాలా చర్చలు జరుగుతున్నాయి. యూకేతో పాటు ప్రపంచ వ్యాప్తంగానూ ఈ ఫోటోలపై చర్చ కొనసాగుతోంది.

Read Also: రూ.40 వేల కేక్, 300 మందికి పార్టీ.. కళ్లు చెదిరేలా కుక్క బర్త్ డే సెలబ్రేషన్స్!

Tags

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×