E-Paper
Advertisement

వందే భారత్‌లో ‘డిస్కౌంట్’ దందా.. టీటీఈకి చుక్కలు చూపించిన ప్రయాణికుడు.. వీడియో వైరల్!

వందే భారత్‌లో ‘డిస్కౌంట్’ దందా.. టీటీఈకి చుక్కలు చూపించిన ప్రయాణికుడు.. వీడియో వైరల్!
Advertisement

Ticket Scam: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనగానే మనకు గుర్తొచ్చేది అత్యుత్తమ సౌకర్యాలు, పక్కాగా ఉండే నిబంధనలు. కానీ, అదే రైలులో ఒక టీటీఈ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. టికెట్ ధరలో బేరసారాలు ఆడి, అడ్డదారిలో డబ్బులు సంపాదించబోయి అడ్డంగా దొరికిపోయాడు.

అసలు ఏం జరిగిందంటే.. ఒక ప్రయాణికుడు వందే భారత్‌లో ప్రయాణిస్తున్నప్పుడు టికెట్ కోసం టీటీఈని సంప్రదించాడు. సాధారణంగా ఆ సీటు ధర రూ. 750 ఉంటుంది. అయితే.. సదరు టీటీఈ ఆ ప్రయాణికుడికి ఒక ‘బంపర్ ఆఫర్’ ఇచ్చాడు. రైల్వే రశీదు (Receipt) లేకుండా కేవలం రూ. 380 నగదు ఇస్తే చాలని.. హాయిగా కూర్చుని ప్రయాణించవచ్చని ఒప్పందం కుదుర్చుకున్నాడు.

Advertisement

ట్విస్ట్ ఏంటంటే.. ఆ ప్రయాణికుడు టీటీఈ మాటలకు లొంగిపోకుండా, ఈ బేరసారాల వ్యవహారాన్నంతటినీ తన ఫోన్‌లో రహస్యంగా రికార్డ్ చేశాడు. టికెట్ ధరలో సగం కంటే తక్కువకే ఇస్తానని టీటీఈ అనడం ఆ వీడియోలో స్పష్టంగా వినిపించింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.

డిజిటల్ చెల్లింపులు, పారదర్శకత గురించి రైల్వే శాఖ ఇంతలా ప్రచారం చేస్తున్నా, ఇలాంటి వారు వ్యవస్థకు చెడ్డపేరు తెస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై రైల్వే శాఖ వెంటనే స్పందించింది. సదరు టీటీఈపై విచారణకు ఆదేశించడమే కాకుండా, ప్రీమియం రైళ్లలో ఇలాంటి అక్రమాలను అస్సలు సహించబోమని తేల్చి చెప్పింది. ఏదేమైనా, ఆ ప్రయాణికుడి సమయస్ఫూర్తి వల్ల ఈ అవినీతి భాగోతం బయటపడింది.

Advertisement

Also Read: కొడుకు చేసిన తప్పుపై బండి సంజయ్ ఏమన్నారంటే..? షాకింగ్ కామెంట్స్

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×