E-Paper
Advertisement

Viral Video: చావును దగ్గర నుంచి చూశాడు.. అదృష్టమంటే ఇతడిదేగా!

Viral Video: చావును దగ్గర నుంచి చూశాడు.. అదృష్టమంటే ఇతడిదేగా!
Advertisement

మనిషి ప్రాణం ఎప్పుడు.. ఎలా పోతుందో చెప్పడం కష్టం. కొన్నిసార్లు చిన్న ఘటనలకే చనిపోవచ్చు, మరికొన్నిసార్లు పెద్ద అపాయం నుంచి సింపుల్ గా బయటపడొచ్చు. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. బస్సు అదుపు తప్పి దుకాణంలోకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదం నుంచి ఓ సైకిలిస్ట్ వెంట్రుక వాసిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌ లోని ఎటావా జిల్లాలో ఈ ఘటన జరిగింది. వైద్‌ పురాలోని ఎటావా-మెయిన్‌ పురి రోడ్డులో ఓ ప్రైవేట్ బస్ససు పెను విధ్వంసాన్ని సృష్టించింది. వైద్ పురా నుంచి వస్తున్న ఈ బస్సు అతి వేగంగా ఉండటంతో డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోయాడు. ముందుగా వెళ్తున్న షిఫ్ట్ డిజైర్ కారును తప్పించే క్రమంలో రోడ్డు పక్కకు వేగంగా దూసుకొచ్చింది. నేరుగా దుకాణంలోకి వెళ్లిపోయింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ప్రయాణికులు భయాందోళనతో కేకలు వేశారు.

తృటిలో ప్రాణాలతో బయటపడ్డ సైకిలిస్ట్

Advertisement

ఈ ఘటనలో దుకాణం బయట తన సైకిల్ ను పార్క్ చేస్తున్న వ్యక్తి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. బస్సు వేగంగా దూసుకురావడాన్ని గమనించి తన సైకిల్ ను పక్కకు విసిరేసి, అక్కడి నుంచి పక్కకు పరిగెత్తాడు. స్పాంటేనియస్ రియాక్షన్ కారణంగా అతడు తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ ప్రమాదంలో 33 మంది ప్రయాణికులు, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు గాయపడ్డారు. తాను “చావును దగ్గర నుంచి చూశాను. క్షణం ఆలస్యం చేసినా పా ప్రాణాలు పోయేవి” అని సైకిలిస్ట్ వివరించాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదృష్టం అంటే అతడితే, అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. లేచిన టైమ్ బాగుందని.. అందుకే సేఫ్ గా బయటపడ్డాడని చెప్తున్నారు.

Advertisement

Read Also: కారు పైకెక్కి సినిమా స్టైల్‌లో ప్రియురాలికి ముద్దులు.. పోలీసులు భలే బుద్ధి చెప్పారు!

నలుగురి పరిస్థితి విషమం

ఈ బస్సు ప్రమాదంలో సుమారు 35 మంది గాయపడగా, వారిని సైఫాయి మెడికల్ యూనివర్శిటీలోని ఎమర్జెన్సీ ట్రామా సెంటర్‌కు తరలించారు.  అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ముందుగా వెళ్తున్న కారు అకస్మాత్తుగా బ్రేక్ వేయడం, బస్సు వేగంగా రావడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.

Read Also:  టైమ్‌కు ఆఫీస్‌కు రావాలన్న బీహారీ బాస్.. దారుణంగా కొట్టించిన మరాఠీ మహిళ!

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×