E-Paper
Advertisement

Dog Video Viral: హనుమాన్ విగ్రహం చుట్టూ వీధి కుక్క ప్రదక్షిణలు.. 36 గంటలుగా తిరుగుతున్న వీడియో వైరల్

Dog Video Viral: హనుమాన్ విగ్రహం చుట్టూ వీధి కుక్క ప్రదక్షిణలు.. 36 గంటలుగా తిరుగుతున్న వీడియో వైరల్
Advertisement

Dog Video Viral: దేవుళ్ల విగ్రహాల చుట్టూ జంతువులు తిరుగుతున్న వీడియోలు ఇటీవల వైరల్ అవుతున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లోని బిజ్నోర్ లో ఓ శునకం దాదాపు 36 గంటల పాటు హనుమాన్ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. విశ్రాంతి కోసం అప్పుడప్పుడూ ఆగినా.. నిరంతరాయంగా కుక్క అలా ప్రదక్షిణలు చేయడంతో.. దానిని చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

వీడియో వైరల్

ఈ వీడియోలో కుక్క హనుమాన్ విగ్రహం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంది. కుక్క చుట్టూ భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెట్టింట భిన్న వాదనలు మొదలయ్యాయి. కొంత మంది మతపరమైన కామెంట్స్ చేస్తుంటే.. దీనిని “CVD ఇన్ఫెక్షన్ హై ఈజ్” అని పేర్కొంటున్నారు. కుక్కకు రేబిస్ ఉందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

ఈ కుక్క ఏదో నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతోందని, వైద్య సహాయం అవసరమని జంతు ప్రేమికులు అంటున్నారు. కుక్కకు వైద్య సహాయం అందించడం మానేసి, ఎందుకు వీడియోలు తీస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

గ్రోక్ ఏఐ ఏమన్నదంటే?

Advertisement

ఈ శునకం ఎందుకు ఇలా చేస్తుందని కొందరు ఎక్స్ లో గ్రోక్ ఏఐని అడిగారు. కుక్కలలో ఇలాంటి ప్రవర్తన కాగ్నిటివ్ డిస్‌ఫంక్షన్ సిండ్రోమ్ (CDS) వల్ల కావొచ్చని గ్రోక్ ఏఐ తెలిపింది. CDS మనుషుల్లో అల్జీమర్స్ మాదిరిగానే మెదడులోని మార్పుల కారణంగా కుక్కలు ఇలా ప్రవర్తిస్తాయని పేర్కొంది. నిద్ర సమస్యలు, పేసింగ్ లేదా ప్రదక్షిణ వంటి పునరావృత చర్యలు చేస్తాయని తెలిపింది.

Also Read:  సీటు కోసం బస్సులో రచ్చ రచ్చ.. జుట్టు పట్టుకుని కొట్లాడుకున్న వీడియో మీరూ చూసేయండి!

‘కుక్క ప్రవర్తనకు వెస్టిబ్యులర్ వ్యాధి, నొప్పి లేదా రాబిస్ వంటి నరాల సంబంధిత సమస్య వల్ల కావచ్చు. ఇలాంటప్పుడు కుక్కలు ఇలా తిరగడం, తినకపోవడం సర్వసాధారణం. అయితే వెటర్నరీ చెక్ అప్ లేకుండా ఇది కారణమని కచ్చితంగా చెప్పడం అసాధ్యం’ అని గ్రోక్ తెలిపింది.

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×