// // Viral video: కబడ్డీ ఆడుతుండగా భారీ శబ్దంతో పిడుగు.. యువకులు పరుగో పరుగు.. వీడియో ఫుల్ వైరల్ -->
E-Paper
Advertisement

Viral video: కబడ్డీ ఆడుతుండగా భారీ శబ్దంతో పిడుగు.. యువకులు పరుగో పరుగు.. వీడియో ఫుల్ వైరల్

Viral video: కబడ్డీ ఆడుతుండగా భారీ శబ్దంతో పిడుగు.. యువకులు పరుగో పరుగు.. వీడియో ఫుల్ వైరల్
Advertisement

Viral video: గత కొన్ని రోజులుగా భారతదేశ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కుండపోత వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో భారీ నష్టం కూడా చేకూరింది. కొన్ని చోట్ల ఇళ్లు కూడా కూలిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కుండపోత వానలు కురిశాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లో వారం రోజుల పాటు వానలు దంచికొట్టాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఉత్తరప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే అక్కడ బస్తీ జిల్లాలో యువకులు కబడ్డీ ఆడుతుండా ఆకస్మికంగా భారీ పిడుగు పడింది. దీంతో యువకులు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి వివరాల గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదవి తీరాల్సిందే..

⦿ పిల్లలంతా కలిసి కబడ్డీ ఆడుతుంటే.. సడెన్‌గా?

Advertisement

యూపీలోని బస్తీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కిసాన్ డిగ్రీ కాలేజీలో కొంత మంది యువకులు, చిన్నారులు ఉత్సాహంగా కబడ్డీ ఆడుతున్నారు. అదే సమయంలో ఆకాశం మేఘావృతమై.. చీకటి మేఘాలతో అప్పుడే లైట్ గా వర్షం ప్రారంభమైంది. యువకులు నార్మల్ రెయినే కదా అని ఆటను కొనసాగించారు. ఇక అంతలోనే పక్కన ఉన్న చెట్లపై ఉరుములు, మెరుపులతో కూడిన భారీ పిడుగు పడింది. అది కూడా ఆకస్మాత్తుగా పిడుగు పడడంతో పిల్లలు భయాందోళనకు గురయ్యారు. ఇక వెంటనే అక్కడను పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే క్షణాల్లోనే తెగ వైరల్ అవుతోంది.

ALSO READ: IBPS RRB Recruitment: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 13,217 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసైతే చాలు..

Advertisement

⦿ వీడియో వేరే లెవల్..

పిడుగు పడిన వెంటేనే అక్కడనున్న యువత క్షణాల్లో పరుగులు తీశారు. భీకర శబ్దంతో పిడుగులు పడడంతో భయాందోళనకు లోనయ్యారు. భారీ పిడుగు నుంచి క్షణాల్లో తప్పించుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పిల్లలంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ యువకుడు తన మొబైల్ ఫోన్ లో బంధించాడు. లక్షలాది మంది ఈ వీడియోను చూసి, షేర్ చేస్తున్నారు. వీడియోకు వేలల్లో కామెంట్లు వస్తున్నాయి..

ALSO READ: BEML LIMITED: టెన్త్, ఐటీఐతో భారీగా పోస్టులు.. అక్షరాల రూ.1,60,000 జీతం.. దరఖాస్తుకు మూడు రోజులే సమయం..!

⦿ మీకు భూమిపై ఇంకా నూకలున్నాయ్.. 

ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు. ‘అరేయ్ కుర్రాళ్లు.. భూమి పై మీకు ఇంకా నూకలు ఉన్నాయ్.. అందుకే బతికిపోయారు’ అని కామెంట్ చేశాడు. మరో నెటిజన్ ‘వర్షం పడినప్పుడు చెట్ల వద్ద ఉండొద్దని.. వీలైనంత వరకు సురక్షిత ప్రదేశంలో ఉండాలి’ అని కామెంట్ చేసుకొచ్చాడు. ‘ఇంకోసారి వర్షం పడే సమయంలో జన్మలో కూడా వాళ్లు ఏ ఆట ఆడరు.. ’ అని కొంత మంది నెటిజన్లు రాసుకొచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా షేర్ అవుతోంది. ఇది కేవలం ఒక కబడ్డీ మ్యాచ్ కంటే ఎక్కువగా, ప్రకృతి ఆశ్చర్యకరమైన శక్తిని ప్రదర్శించే ఒక ఘటనగా చర్చనీయాంశంగా మారింది.

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×