E-Paper
Advertisement

Tirumala Tallest Woman: ఏయ్ బాబోయ్‌ ఎంత పొడుగో.. తిరుమలలో ఎత్తైన మహిళ సందడి

Tirumala Tallest Woman: ఏయ్ బాబోయ్‌ ఎంత పొడుగో.. తిరుమలలో ఎత్తైన మహిళ సందడి
Advertisement

Tirumala Tallest Woman: తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేల మంది దేశ విదేశాల నుంచి తరలి వస్తుంటారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ మహిళ అందరి దృష్టిని ఆకర్షించింది. తిరుమలలో వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్‌ స్వామి, ఆయన భక్త బృందంతో పాటు ఏడు అడుగుల ఎత్తైన మహిళ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఎత్తైన మహిళను చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆమె ఎవరని భక్తులు ఆరా తీయగా.. శ్రీలంకకు చెందిన నెట్‌ బాల్ మాజీ క్రీడాకారిణి తర్జిని శివలింగం అని తెలిసింది.

ఏడు అడుగుల ఎత్తున్న మహిళ

ఆలయ ప్రాంగణంలో ఏడు అడుగుల ఎత్తున్న మహిళ భక్తుల మధ్య ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు. ఆమెను చూసిన భక్తులు ఆశ్చర్యపోయారు. ఆమెతో ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. శ్రీలంకకు చెందిన మాజీ నెట్‌బాల్ క్రీడాకారిణి తర్జిని శివలింగం సోమవారం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి భక్త బృందంతో కలిసి ఆమె తిరుమలకు వచ్చారు. ఏడు అడుగుల ఎత్తుతో ఉన్న ఆమెను ఆలయ పరిసరాల్లో చూసిన భక్తులు కాసింత ఆశ్చర్యానికి గురయ్యారు. చాలా మంది ఆమె వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆలయ పరిసరాల్లో కాసేపు సందడి వాతావరణం కనిపించింది.

Advertisement

Also Read:  CM Chandrababu: ఏపీలో హిందుజా భారీ పెట్టుబడులు.. రూ. 20,000 కోట్లతో కీలక ఒప్పందం!

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×