// // Viral Video- ఊరి మీద పడి ఏనుగు బీభత్సం.. వైరల్ అవుతున్న వీడియో -->
E-Paper
Advertisement

Viral Video: ఊరి మీద పడి ఏనుగు బీభత్సం.. వైరల్ అవుతున్న వీడియో

Viral Video: ఊరి మీద పడి ఏనుగు బీభత్సం.. వైరల్ అవుతున్న వీడియో
Advertisement

Viral Video: సోషల్ మీడియాలో తరచూ జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అవి అడవుల్లోవే కానీ, పెంపుడు జంతువులే కానీ ఇలా అన్నీ జంతువుల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే అడవుల్లోని చెట్లను నరుకుతుండడం వల్ల అడవవుల్లో నివసించే జంతువులు గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. నీళ్లు, నీడ లేక గ్రామాల్లోని జన నివాసాల్లోకి ప్రవేశించి అందరిని భయబ్రాంతులకు గురిచేస్తుంది.

అడవి జంతువుల్లో ముఖ్యంగా ఏనుగులు అంటే అందరు ఇష్టపడుతుంటారు. అదే విధంగా భయపడుతుంటారు కూడా. ఎందుకంటే ఇవి ఎక్కువగా గ్రామాలు, పొలాల్లోకి ప్రవేశించి జనాలను భయబ్రాంతులకు గురిచేస్తుంటాయి. ఇలా చాలా చోట్ల పొలాల్లోకి ప్రవేశించి పంటను నాశనం చేయడం, గ్రామాల్లోకి ప్రవేశించి జనాలపై దాడికి పాల్పడిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా మరోసారి ఏనుగులు గ్రామం మీద పడి బీభత్సం సృష్టించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Advertisement

ఓ అడవికి దగ్గరలో ఉండే గ్రామంలోకి ఏనుగు ప్రవేశించింది. ఆ వేశంతో ఉన్న ఆ ఏనుగు ఒక్కసారిగా రోడ్డు పక్కనే పార్క్ చేసి ఉన్న బైకును ఒక్క తోపు తోసింది. దీంతో ఒక్కసారిగా ఆ బైక్ కింద పడిపోయింది. వెంటనే గ్రామంలోకి ప్రవేశించి రోడ్డు పక్కన ఉన్న వాటిపై దాడికి పాల్పడింది. ఆ తరుణంలో అక్కడ రోడ్డుపై ఉన్న ఆటోను కూడా తోసేసింది. అనంతరం కారును కూడా తోసేయాలని ప్రయత్నించగా డ్రైవర్ గమనించి అప్రమత్తమై వాహనాన్ని వెనక్కి తీసి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో ఏనుగు గ్రామంపై పడి బీభత్సం సృష్టిస్తుందని నెట్టింట వీడియోలు షేర్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×