E-Paper
Advertisement

Wedding Invitation Video: కాస్ట్లీ ఇన్విటేషన్ గురూ.. మ్యాక్ బుక్ ఇచ్చి పెళ్లికి ఆహ్వానం.. తీరా చూస్తే

Wedding Invitation Video: కాస్ట్లీ ఇన్విటేషన్ గురూ.. మ్యాక్ బుక్ ఇచ్చి పెళ్లికి ఆహ్వానం.. తీరా చూస్తే
Advertisement

Wedding Invitation Video: పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. అయితే జీవితంలో ఒక్కసారి చేసుకునే పెళ్లి కోసం ఎన్నో కలలు కంటారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న యువత అయితే పెళ్లి అంటే చాలు అసలు ఎవరు చేసుకోని విధంగా ఉండాలని కోరుకుంటున్నారు. పెళ్లి చూపుల నుంచి మొదలుకుని హనీమూన్ వరకు ఎంతో ప్రత్యేకంగా ఉండాలని ప్లాన్లు వేస్తుంటారు. ఈ క్రమంలో పెళ్లి చూపులు, ఫోటోలు, వీడియోలు, బంధువుల వేషాధరణ, పెళ్లి బాజాలు, పెళ్లి మండపం, భోజనాలు, ఫోటో షూట్, పంతులు, పెళ్లి భరత్, ముఖ్యంగా పెళ్లి ఆహ్వాన పత్రికతో సహా అన్నీ వినూత్నంగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే తాజాగా ఓ పెళ్లి జంట తమ పెళ్లి కోసం వినూత్న రీతిలో ఆహ్వానం అందించింది.

పెళ్లి పత్రికలు అంటే సాధారణంగా దేవుడి ఫోటోలు ఉండేవి. కానీ ప్రస్తుతం ఉన్న యువత తమ పెళ్లి పత్రిక కూడా ఎంతో అద్భుతంగా ఉండాలని వారే డిజైన్ చేసుకుంటున్నారు. ఈ తరుణంలో పెళ్లి పత్రికలో రాజకీయ నాయకుల ఫోటోలు, సెలబ్రిటీల ఫోటోలు, ఆధార్ కార్డు టైప్ పత్రికలు వంటివి వినూత్నంగా ప్రింట్ చేసి పంచుతుంటారు. ఇలా పత్రికలు ఇస్తూ బంధువులను కూడా ఆశ్చర్యపరుస్తుంటారు. అయితే తాజాగా ఓ పెళ్లి జంట చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement

తమ పెళ్లికి వచ్చే అతిథులు, బంధుమిత్రులను ఆహ్వానించేందుకు వినూత్న ఆలోచన చేశారు. ఏకంగా మాక్ బుక్ ను ఇచ్చి తమ పెళ్లికి ఆహ్వానించాలని అనుకున్నారు. ఈ క్రమంలో మాక్ బుక్ చూసి అది నిజమైనదనే అనిపించినా కూడా ఒక్కసారిగా దాన్ని ఓపెన్ చేసి చూస్తే షాక్ అవుతారు. మాక్ బుక్ టైప్ లో ఉండేలా పత్రికను ప్రింట్ చేయించారు. ఈ క్రమంలో పైన కవర్ మాక్ బుక్ లా కనిపిస్తుంది. దానిని ఓపెన్ చేసి చూస్తే ఓ వైపు కీ బోర్డ్, మరోవైపు గూగుల్లో సెర్చ్ చేస్తే పెళ్లికి సంబంధించిన వివరాలు వచ్చినట్లు కనిపించాయి. ఇలా తమ పెళ్లి పత్రికను తయారుచేసి బంధువులకు పంచేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Manoj Kumar (@manoj_rationalist)

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×