// // లోకల్ బస్సు ఎక్కితే.. దుబాయికి టికెట్ కొట్టాడు.. ఇదేందయ్యా ఇది! -->
E-Paper
Advertisement

లోకల్ బస్సు ఎక్కితే.. దుబాయికి టికెట్ కొట్టాడు.. బిత్తరపోయిన ప్యాసింజర్!

లోకల్ బస్సు ఎక్కితే.. దుబాయికి టికెట్ కొట్టాడు.. బిత్తరపోయిన ప్యాసింజర్!
Advertisement

Dubai Bus Ticket: తమిళనాడు ఆర్టీసీ (TNSTC)లో జరిగిన ఓ పొరపాటు.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తమిళనాడుకు చెందిన ఒక ప్రయాణికుడు భవానీ బైపాస్ వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కాడు. అతను హోసూర్ వెళ్లడానికి టికెట్ అడగ్గా.. కండెక్టర్ ఇచ్చిన టికెట్ చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. సాధారణంగా భవానీ బైపాస్ నుండి హోసూర్‌కు టికెట్ ధర రూ.వందల్లో ఉంటుంది. కానీ ఆ ప్రయాణికుడికి రూ.10,000తో టికెట్ ఇచ్చి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాడు. అది కూడా దుబాయి వరకూ టికెట్ ఇచ్చి.. మరింత ఖంగు తినేలా చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది.

కండక్టర్ ఇచ్చిన టికెట్ లో రూ.10,000 వెల ఉండటంతో పాటు ‘భవానీ బైపాస్ టు దుబాయ్’ (Bhavani Bypass to Dubai) అని ప్రింట్ అయి ఉంది. సాధారణంగా లోకల్ తమిళనాడు లోకల్ బస్సుల్లో ఎంత పెద్ద మెుత్తంలో టికెట్ ఉండదు. అది కూడా ఆ బస్సు తిరిగే ప్రాంతాల డిటైయిల్స్, టికెట్ ధరలు మాత్రమే కండక్టర్ వద్ద ఉండే మిషన్ లో ఇన్ బిల్ట్ అయ్యి ఉంటుంది. అలాంటిది దుబాయికి అది కూడా రూ.10,000కు టికెట్ రావడం ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పొచ్చు.

Advertisement

దుబాయికి ఇచ్చిన టికెట్ ఫొటో.. నెట్టింట వైరల్ కావడంతో తమిళనాడు రవాణా శాఖ అధికారులు స్పందించారు. ఇది కండక్టర్ కావాలని చేసింది కాదని, టికెట్ జారీ చేసే ఎలక్ట్రానిక్ టికెటింగ్ మిషన్ (ETM) లో జరిగిన సాంకేతిక లోపం (Technical Glitch) అని వారు పేర్కొన్నారు. మిషన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లేదా డేటా ఎంట్రీలో జరిగిన తప్పు వల్ల ‘హోసూర్’ పడాల్సిన చోట ‘దుబాయ్’ అని, ధర రూ. 10,000 అని ప్రింట్ అయి ఉండొచ్చని పేర్కొన్నారు.

Advertisement

Also Read: BSNLకు హైకోర్టు బిగ్ షాక్.. ఏకంగా రూ.55 లక్షల జరిమానా.. అసలేం జరిగిందంటే?

మరోవైపు ఈ విచిత్ర ఘటనపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘పాస్‌పోర్ట్ లేదు.. వీసా లేదు.. కేవలం రూ. 10,000 కే చెన్నై బస్సులో దుబాయ్ వెళ్ళిపోవచ్చు’ అంటూ టికెట్ ఫోటోను షేర్ చేస్తున్నారు. తమిళనాడు ఆర్టీసీ బస్సు సేవలు అంతర్జాతీయ స్థాయికి చేరాయంటూ సెటైర్లు వేస్తున్నారు. ‘దుబాయ్ బుర్జ్ ఖలీఫా ముందు బస్సు ఆపుతారా బ్రదర్?’ అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఏదేమైనా సాంకేతిక లోపం వల్ల జరిగిన ఈ చిన్న పొరపాటు.. నెట్టింట ఫన్నీ చర్చకు దారితీసిందని చెప్పవచ్చు.

Also Read: iOS 27 వచ్చేసింది.. iPhone 11 నుండి iPhone 17 Pro Max వరకు.. ఎవరెవరికి సపోర్ట్ చేస్తుందంటే?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×