E-Paper
Advertisement

ఆ డాక్యుమెంటరీ చూసి ఎమోషనల్ అయిన ధనుష్.. ‘ఎప్పటికీ నువ్వే GOAT’ అంటూ..’

ఆ డాక్యుమెంటరీ చూసి ఎమోషనల్ అయిన ధనుష్.. ‘ఎప్పటికీ నువ్వే GOAT’ అంటూ..’
Advertisement

Rafa Documentary: టెన్నిస్ కోర్టులో రఫెల్ నాదల్ సృష్టించిన సునామీ గురించి ప్రపంచానికి తెలుసు. కానీ, ఆ విజయాల వెనుక ఆయన అనుభవించిన నరకయాతన ఎంతటిదో ‘నెట్‌ఫ్లిక్స్’ ఇటీవల విడుదల చేసిన ‘రాఫా’ (Rafa) డాక్యుమెంటరీ కళ్లకు కట్టింది. ఈ డాక్యుమెంటరీ చూసిన కోట్లాది మంది అభిమానుల్లాగే, వైవిధ్యభరిత నటుడు ధనుష్ సైతం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఒక సాదాసీదా అభిమానిలా నాదల్‌పై తనకున్న ప్రేమాభిమానాలను, అలాగే గతంలో తెలియక చేసిన తప్పులకు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Read also-ట్రోలింగ్‌పై జగపతి బాబు సీరియస్.. అందుకు తారక్ ఏడుస్తున్నట్లు క్రియేట్ చేసి..

Advertisement

ధనుష్ తన పోస్ట్‌లో.. నాదల్ మ్యాచ్‌లు ఓడిపోయినప్పుడు టీవీల ముందు కూర్చుని తాను గట్టిగా అరిచేవాడినని గుర్తుచేసుకున్నారు. “ఆటకు నీ సర్వస్వం ఇచ్చే క్రమంలో బ్యాక్‌స్టేజ్‌లో నువ్వు ఎంతటి శారీరక, మానసిక ఒత్తిడిని, తీవ్రమైన నొప్పిని అనుభవించావో ఈ డాక్యుమెంటరీ చూసే వరకు నాకు తెలియదు. ‘రాఫా.. నువ్వు ఇంకా బాగా ఆడి ఉండాల్సింది’, ‘నీపై నువ్వే ఎందుకు ఇంత ఒత్తిడి పెంచుకుంటున్నావు?’ అంటూ గతంలో నీ మ్యాచ్ పాయింట్లు పోయినప్పుడు నేను అరిచినందుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నాను” అంటూ తన పశ్చాత్తాపాన్ని పంచుకున్నారు.

Read also-Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇది అస్సలు ఊహించలేదు..

Advertisement

కోర్టులో నాదల్ వాటర్ బాటిళ్లను ఒక పద్ధతిలో అమర్చడం, గీతలను క్లియర్ చేయడం వంటి అలవాట్లను చాలామంది మూఢనమ్మకాలు అనుకుంటారని, కానీ అవి మ్యాచ్‌కు ముందు నాదల్ తన మనస్సుతో, ఒత్తిడితో చేసే అంతర్గత యుద్ధంలో భాగమని ధనుష్ కొనియాడారు. ముల్లర్-వీస్ సిండ్రోమ్ వంటి భయంకరమైన పాదాల సమస్య, లెక్కలేనన్ని గాయాలు ఉన్నప్పటికీ.. నాదల్ 22 గ్రాండ్ స్లామ్‌లు సాధించడం ఒక అద్భుతమని అభినందించారు.

“గణాంకాలు నోవాక్ జకోవిచ్‌కు అనుకూలంగా ఉండవచ్చు, టెన్నిస్ అందం రోజర్ ఫెదరర్ కావచ్చు. కానీ నా దృష్టిలో, నాలాంటి కోట్లాది మంది దృష్టిలో ఎప్పటికీ నువ్వే GOAT (Greatest Of All Time). గాయాల నుంచి ప్రతిసారీ పుంజుకున్న నా ఫీనిక్స్ పక్షివి నువ్వే” అని ధనుష్ స్పష్టం చేశారు. టెన్నిస్ ఆట కోసం తన శరీరాన్ని, ఆత్మను పణంగా పెట్టి, లక్షలాది మందికి పోరాట పటిమను నేర్పినందుకు నాదల్‌కు ధన్యవాదాలు తెలుపుతూ, “ఎప్పటికీ నీ అభిమానిని” అంటూ ధనుష్ ఈ ఎమోషనల్ పోస్ట్‌ను ముగించారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×