E-Paper
Advertisement

Viral Video: అంతా క్షణాల్లో.. సోఫా నుంచి లేచాడు, ఒక్కసారి పేలిన గన్.. వీడియో వైరల్

Viral Video: అంతా క్షణాల్లో.. సోఫా నుంచి లేచాడు, ఒక్కసారి పేలిన గన్..  వీడియో వైరల్
Advertisement

Viral Video: ఏ వ్యక్తైనా ప్రాణం పోవడానికి క్షణాలు చాలు. ఆ తరహా ఘటనలు అప్పుడప్పుడు జరుగుతున్న సందర్భాలు లేకపోలేదు. అప్పటివరకు మిత్రులతో ఎంజాయ్ చేయిన ఎన్నారై సడన్‌గా పిస్టల్ పేలింది. క్షణాల వ్యవధిలో అతడు మృత్యువాతపడ్డారు. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటన ఏం జరిగింది?

పిస్టల్ పేలి ఎన్నారై మృతి

Advertisement

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లా ధని సుచాసింగ్ గ్రామంలో ఊహించని ఘటన జరిగింది. ప్రవాస భారతీయుడు తన లైసెన్స్ పొందిన పిస్టల్ నడుమకు పెట్టుకున్నాడు. సోఫా నుంచి లేస్తుండగా ప్రమాదవశాత్తు పేలి మరణించాడు. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు ఇంట్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

హర్పిందర్ సింగ్ అలియాస్ సోను అని ముద్దుగా కుటుంబసభ్యులు పిలుచుకుంటారు. ఘటన సమయంలో హర్పిందర్ ఇంట్లో కూర్చుని తన బంధువుతో మాట్లాడుతున్నాడు. అతడి నడుము వద్ద పూర్తిగా లోడ్ చేయబడిన పిస్టల్‌ ఉంది. సోఫా నుంచి లేచి నిలబడటానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తూ గన్ ఫైర్ అయ్యింది.

Advertisement

పంజాబ్‌లో ఊహించని ఘటన

హర్పిందర్ కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. ఇంటి సీసీటీవీ దృశ్యాల ఆధారంగా తుపాకీ కాల్పుల తర్వాత కుటుంబసభ్యులు భయంతో గదిలోకి పరుగెడుతున్న కనిపించాయి. రక్తస్రావం అవుతున్న హర్పిందర్‌ని పట్టుకుని తరలించడానికి బంధువులు ప్రయత్నిస్తున్నారు.

తొలుత ప్రభుత్వ ఆసుపత్రికి సోనును తరలించారు. చివరకు అక్కడి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే హర్పిందర్ మృతి చెందాడు. చాలా ఏళ్లు విదేశాలలో గడిపిన తర్వాత సోను ఇటీవల పంజాబ్‌కు తిరిగి వచ్చాడు. స్వగ్రామంలో స్థిరపడేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. మూడేళ్ల కిందట వివాహం జరిగింది.

ALSO READ: ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్.. మాకు ఏం పనిలేదు, డ్యూటీలో మహిళా కానిస్టేబుల్ ఇన్‌స్టా లైవ్

రెండేళ్ల కూతురు ఉంది. సోను ఆకస్మిక మరణం గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. మృతదేహానికి పోస్టుమార్టం తర్వాత బంధువులకు పోలీసులు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు హర్పిందర్ తండ్రి దర్శన్ సింగ్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.

 

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×