E-Paper
Advertisement

డోర్ దగ్గర గొడవ.. లోకల్ ట్రైన్‌లో యువకుడి దారుణ హత్య.. అసలేం జరిగిందంటే?

డోర్ దగ్గర గొడవ.. లోకల్ ట్రైన్‌లో యువకుడి దారుణ హత్య.. అసలేం జరిగిందంటే?
Advertisement

Train Murder: ముంబై లోకల్ రైలులో ఊహించని ఘోరం జరిగింది. చిన్నపాటి ఘర్షణ కాస్తా ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. రైలు డోరు మూసే విషయంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య మొదలైన సాధారణ వివాదం.. చివరకు కత్తితో పొడిచి చంపేంతవరకు వెళ్లింది. మృతుడ్ని మయాంక్ లోహర్ (21 ఏళ్లు)గా గుర్తించిన పోలీసులు.. నిందితుడైన రోషన్ సువర్ణను అరెస్టు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. మయాంక్ లోహర్ చర్చ్ గేట్ – నల్లాసోపారా ఫాస్ట్ లోకల్ రైలులో ప్రయాణిస్తున్నాడు. రైలు గోరెగావ్ – కాండివాలి మధ్య ప్రయాణిస్తుండగా వర్షం మెుదలైంది. దీంతో రైలు డోర్ మూసే విషయంలో మయాంక్, రోషన్ మధ్య చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది. అది కాస్త తీవ్ర రూపం దాల్చడంతో.. బ్యాగులోని కత్తిని తీసుకొని మయాంక్ పై రోషన్ దాడి చేశాడు. దీంతో మయాంక్ తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

అయితే దాడి అనంతరం రోషన్.. రైలు దిగి అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని ముంబయిలోని కుర్లా ప్రాంతంలో గుర్తించి అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం బోరివాలి రైల్వే ఇన్ స్పెక్టర్ దత్తా ఖుప్రేకర్ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు పంచుకున్నారు. రోషన్ తో మయాంక్ గొడవ పడిన తీరు చూసి తోటి ప్రయాణికులు తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు చెప్పారు. దీంతో మయాంక్ పై దాడికి యత్నించినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే మయాంక్ బ్యాగులోని కత్తి తీసుకొని రోషన్ పై దాడి చేసినట్లు స్పష్టం చేశారు. అనంతరం పారిపోయాడని వివరించారు.

Advertisement

Also Read: వాట్సప్‌లో బ్లాక్ చేశారని డౌటా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో.. ఈజీగా కనిపెట్టేయండి!

దాడి సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటీనా రైలు వద్దకు చేరుకున్నట్లు ఇన్ స్పెక్టర్ తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టంకు తరలించినట్లు చెప్పారు. హత్యానేరం కింద నిందితుడిపై కఠిన సెక్షన్లు పెట్టినట్లు తెలియజేశారు. మరోవైపు మృతుడి తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డకు న్యాయం చేయాలని పట్టుబట్టారు. నిందితుడికి మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. నిందితుడికి శిక్ష పడకపోతే.. రేపు మరొకరికి ఇదే పరిస్థితి ఎదురుకావొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: నిప్పులకుంపటిలా ఆకాశం.. ఫ్రాన్స్‌ను చుట్టేసిన ‘ఓమేగా బ్లాక్’.. 40 మంది మృతి

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×