E-Paper
Advertisement

Snake Bite: షాకింగ్.. పాము కరిచిందని దాన్ని జేబులో వేసుకుని…!

Snake Bite: షాకింగ్.. పాము కరిచిందని దాన్ని జేబులో వేసుకుని…!
Advertisement

Snake Bite: ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. ఒక ఈ-రిక్షా డ్రైవర్ తనను పాము కరిచిందంటూ, ఆ పామును ఏకంగా తన జాకెట్ జేబులో పెట్టుకుని జిల్లా ఆసుపత్రికి రావడంతో అక్కడి రోగులు, వైద్యులు బెంబేలెత్తిపోయారు. మథురకు చెందిన దీపక్ (39) అనే వ్యక్తి సోమవారం బృందావన్ వెళ్తుండగా పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఒక అడుగున్నర పొడవున్న పాము (కోబ్రా) అతడిని కరిచింది. దీంతో చికిత్స కోసం ఆ పామును వెంటబెట్టుకుని ఆసుపత్రికి చేరుకున్నాడు.

ఆసుపత్రిలో తనకు సకాలంలో చికిత్స అందడం లేదని ఆరోపిస్తూ దీపక్ ఆసుపత్రి బయట నిరసనకు దిగాడు. ఈ క్రమంలో అక్కడి వారు “పాము ఎక్కడ?” అని ప్రశ్నించగా, తన జాకెట్ నుండి సజీవంగా ఉన్న పామును బయటకు తీసి చూపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇతర రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున పామును బయట వదిలేయాలని వైద్యులు కోరినప్పటికీ, అతడు వినలేదు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో, ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని అతడు ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది.

Advertisement

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దీపక్‌ను శాంతింపజేశారు. ఆ పామును సురక్షితంగా ఒక పెట్టెలో బంధించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం వైద్యులు అతడికి యాంటీ-వెనం ఇంజెక్షన్ ఇచ్చి చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం దీపక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చీఫ్ మెడికల్ సూపర్ ఇన్ టెండెంట్ నీరజ్ అగర్వాల్ తెలిపారు. అయితే, ఆ పాము దీపక్ పెంచుకుంటున్నదే కావచ్చని ఆసుపత్రి వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×