// // Viral Student Letter: సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి.. విద్యార్థి రాసిన వింత ఉత్తరం.. -->
E-Paper
Advertisement

Viral Student Letter: సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి.. విద్యార్థి రాసిన వింత ఉత్తరం..

Viral Student Letter: సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి.. విద్యార్థి రాసిన వింత ఉత్తరం..
Advertisement

Viral Student Letter: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి రాసిన వింత ఉత్తరం తెగ వైరల్ అవుతోంది. పరీక్షలో పాస్ చేయమని కోరుతూ ఆ విద్యార్థి తన ఆన్సర్ షీట్‌లో రాసిన మేటర్ చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. “సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి” అంటూ సదరు విద్యార్థి ఎగ్జామినర్‌ను వేడుకున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఆ విద్యార్థి రాసిన లేఖలో కేవలం అభ్యర్థనలు మాత్రమే కాదు, వింత బొమ్మలు కూడా ఉన్నాయి. ఒక బొమ్మలో విద్యార్థి తన గురువు కాళ్లపై పడి నమస్కరిస్తున్నట్లు గీసి, పక్కనే “సార్ నేను” అని రాశాడు. “నాకు అమ్మ, నాన్న లేరు సార్.. మీరే నాకు అమ్మ, నాన్న” అంటూ ఎగ్జామినర్‌ను ఎమోషనల్‌గా బుట్టలో వేసే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా, “నేను చదివినవి ఏవీ రాలేదు సార్.. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా.. ఆ దేవుడు మీరే సార్” అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.

ఈ లేఖ ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియకపోయినా, అచ్చంపేట ప్రాంతానికి సంబంధించి సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. “సార్.. మీరు పాస్ చేస్తే మీరు మేలు చేసిన వారవుతారు.. ప్లీజ్ సార్” అంటూ రాసిన ఈ వింత జవాబు పత్రాన్ని చూసి దిద్దుబాటు చేసే టీచర్లు కూడా షాక్ అవుతున్నారు. పరీక్షకు ప్రిపేర్ అవ్వడం కంటే, ఇలాంటి బొమ్మలు గీసి లేఖలు రాయడానికే ఆ విద్యార్థి ఎక్కువ టైమ్ కేటాయించినట్లు నెటిజన్లు జోకులు వేస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం ఈ ఫోటోను షేర్ చేస్తూ, “వీడికి క్రియేటివిటీకి 100 మార్కులు వేయాలి” అని కొందరు, “పాపం ఎగ్జామినర్ పరిస్థితి ఏంటో” అని మరికొందరు కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. చదువు రాకపోయినా, చాకచక్యంగా ప్రాధేయపడే విద్యార్థుల టాలెంట్‌కు ఇది ఒక నిదర్శనమని సోషల్ మీడియా కోడై కూస్తోంది.

Read Also: యూనివర్శిటీల్లో వింత కోర్సులు.. ఏంటీ ఇవి కూడా నేర్పిస్తారా? అస్సలు నమ్మలేం!

Tags

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×