// // Gurugram Techie Food Spending: జొమాటో, స్విగ్గీ వాడుతున్నారా? -->
E-Paper
Advertisement

జొమాటో, స్విగ్గీ వాడుతున్నారా? ఈ బిల్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం!

జొమాటో, స్విగ్గీ వాడుతున్నారా? ఈ బిల్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం!
Advertisement

Gurugram Techie Food Spending:ప్రతిరోజూ జొమాటో, స్విగ్గీల్లో ఆర్డర్లు పెట్టే అలవాటు ఉందా? అయితే ఒక్కసారి ఇది చూడండి. మనం చేసే చిన్న చిన్న ఖర్చులు మన పర్సుకి ఎంత పెద్ద బొక్క చూపిస్తూ ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.తాజాగా ఓ గుర్‌గావ్ ఐటీ ఉద్యోగి తన మూడు నెలల ఫుడ్ ఖర్చులను లెక్కేసుకుని షాక్‌కు గురయ్యాడు. కేవలం 90 రోజుల్లో అతను ఫుడ్ డెలివరీ యాప్స్, చుట్టుపక్కల రెస్టారెంట్ల కోసం ఏకంగా రూ.35,400 తగలేశాడు. ఈ విషయాన్ని ఆ యూజర్ ‘రెడ్డిట్’ వేదికగా పంచుకుంటూ, ఈ నంబర్లు చూశాక నాకే భయమేసింది అంటూ వాపోయాడు.

మూడు నెలలకి రూ.35,400 ఖర్చు 

సాధారణంగా రోజుకు రూ .200 లేదా రూ.300 ఆర్డర్ పెడితే పెద్దగా అనిపించదు కానీ, వాటిని మొత్తంగా ఒకసారి లెక్కేసినప్పుడు అసలు నిజం బయటపడింది. ఆ యూజర్ షేర్ చేసిన మంత్లీ బ్రేకప్ ప్రకారం మొదటి నెల రూ11,400, రెండవ నెల రూ. 13,200, మరియు మూడవ నెల రూ.10,800 చొప్పున మొత్తం రూ.35,400 ఖర్చయింది. తాను పీజీలో ఉంటానని, ఆకలేసినప్పుడల్లా జొమాటో ఓపెన్ చేయడం లేదా రూమ్ పక్కన ఉన్న రెస్టారెంట్‌కు వెళ్లడం అలవాటుగా మారిందని, తీరా మూడు నెలల తర్వాత కూర్చుని లెక్కలు కడితే మైండ్ బ్లాంక్ అయిందని అతడు పేర్కొన్నాడు.

Advertisement

also read :మహేష్ బాబు సినిమా తర్వాత రాజమౌళి నెక్స్ట్ టార్గెట్.. మళ్లీ ఆ హీరోతోనేనా?

ఈ స్టోరీలో అసలైన ట్విస్ట్ ఏంటంటే, అంత డబ్బు ఖర్చు పెట్టేసినా అతనికి క్వాలిటీ ఫుడ్ దక్కలేదు. తాను పెట్టిన ఖర్చులో ఎక్కువ భాగం ఆన్‌లైన్ డెలివరీలకే పోయిందని, కానీ ఎప్పుడూ క్వాలిటీ ఒకేలా ఉండేది కాదని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. చాలాసార్లు ఫుడ్ తిన్నాక ఏదో అసంతృప్తి మిగిలేదని, ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ స్క్రోల్ చేస్తూ టైంపాస్ చేయడం అలవాటైందని చెప్తూ అర్బన్ లైఫ్‌స్టైల్‌లోని లోపాలను ఎండగట్టాడు. అంటే ఇక్కడ కేవలం డబ్బు మాత్రమే కాదు, పరోక్షంగా ఆరోగ్యం కూడా పాడవుతోందనే హెచ్చరిక ఈ పోస్ట్‌లో కనిపిస్తోంది. మెట్రో సిటీస్ అయిన గుర్‌గావ్, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో బిజీ వర్క్ షెడ్యూల్స్ వల్ల యువత ఈ ‘కన్వీనియన్స్ ట్రాప్’ (సౌకర్యాల వల) లో దారుణంగా చిక్కుకుపోతున్నారు.ఈ రెడ్డిట్ పోస్ట్ వైరల్ అవ్వగానే నెటిజన్ల నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది. కొందరైతే గుర్‌గావ్, బెంగళూరు లాంటి సిటీల్లో బ్రతకడమే ఖరీదని, ఈ ఖర్చు చాలా నార్మల్ అని సపోర్ట్ చేసుకొచ్చారు.మరికొందరు మాత్రం ఫైనాన్షియల్ డిసిప్లెన్ ముఖ్య్యమని అని హెచ్చరిస్తున్నారు

Advertisement

also read :Kissik Talks Show :హీరోయిన్ అవ్వాలంటే బాడీ మెజర్మెంట్స్ కావాలా? స్నో అక్క’ మౌనిష కాస్టింగ్ కౌచ్ కామెంట్స్ వైరల్!

మీరు ఫుడ్ యాప్స్‌కి ఎంత సమర్పిస్తున్నారో

నెలకు ఒక రూమ్ మేట్‌ని పెట్టుకుని వంటమనిషిని హైర్ చేసుకుంటే రూ.4,000 లోపే హెల్తీ ఫుడ్ దొరుకుతుందని, ఇలా యాప్స్‌కి బానిసలు కాకండి అని సలహాలు ఇస్తున్నారు. రూ. 35 వేలు అనేది ఒక సాధారణ ఉద్యోగి నెల జీతం కావచ్చు, అలాంటిది కేవలం మూడు నెలల జంక్ ఫుడ్‌కే అంత తగలేయడం అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. చిన్న చిన్న ఖర్చులే కదా అని లైట్ తీసుకుంటే లాంగ్ రన్‌లో మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అవ్వడం ఖాయం. ఈ రోజే మీరు ఫుడ్ యాప్స్‌కి ఎంత సమర్పిస్తున్నారో ఒక్కసారి చెక్ చేసుకోండి.

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×