E-Paper
Advertisement

Viral News: గ్రామానికి పట్టిన కీడు.. ఇళ్లకు తాళాలు వేసి గ్రామస్థులు చేసిన పనికి అందరూ షాక్!

Viral News: గ్రామానికి పట్టిన కీడు.. ఇళ్లకు తాళాలు వేసి గ్రామస్థులు చేసిన పనికి అందరూ షాక్!
Advertisement

Viral News: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామంలో గత మూడు నెలలుగా వరుస మరణాలు గ్రామస్థులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కేవలం 90 రోజుల వ్యవధిలో 28 మంది వివిధ కారణాలతో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. అనారోగ్యం, వృద్ధాప్యం, ప్రమాదాలు ఇలా కారణాలేవైనా.. వరుసగా ఇన్ని మరణాలు సంభవించడం వెనుక ఏదో ‘కీడు’ ఉందని గ్రామస్థులు బలంగా నమ్మారు.

పురోహితుడి సూచన.. డప్పు చాటింపు

Advertisement

గ్రామంలో నెలకొన్న ఈ విషాద ఛాయలను తొలగించుకునేందుకు గ్రామ పెద్దలు, యువకులు కలిసి గ్రామ పురోహితుడిని సంప్రదించారు. గ్రామానికి గండం ఉందని దాని నివారణ కోసం గ్రామస్థులందరూ ఒక రోజంతా ఊరు ఖాళీ చేసి బయట గడపాలని ఆయన సూచించారు (దీనిని ‘కీడు వంటలు’ లేదా ఊరు విడిచి వెళ్లడం అని పిలుస్తారు). ఈ మేరకు ముందు రోజే గ్రామంలో డప్పు చాటింపు వేయించి, ఎవరూ ఇంట్లో ఉండకూడదని నిర్ణయించుకున్నారు.

అడవి బాట పట్టిన గ్రామస్థులు

Advertisement

పురోహితుడి సూచన మేరకు నేడు తెల్లవారుజామునే గ్రామస్థులంతా తమ ఇళ్లకు తాళాలు వేసి ఊరి బయటకు వెళ్లారు. పసిపిల్లల నుండి ముసలివారి వరకు ప్రతి ఒక్కరూ వంట సామాగ్రి, నిత్యావసరాలతో పొలాల బాట పట్టారు. ఊరి పొలిమేర దాటిన తర్వాత చెట్ల కింద, పొలాల్లో వంటలు చేసుకుని సామూహిక భోజనాలు చేశారు. ఇలా చేయడం వల్ల గ్రామానికి పట్టిన పీడ విరుగడవుతుందని, మరణాలు ఆగుతాయని వారు విశ్వసిస్తున్నారు.

నమ్మకం.. మరణాల తగ్గుదల

విశేషమేమిటంటే.. ఈ ‘కీడు వంటల’ కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నప్పటి నుండి గ్రామంలో మరణాలు ఆగాయని గ్రామస్థులు చెబుతుండడం గమనార్హం. ఆధునిక కాలంలో ఇలాంటి నమ్మకాలు వింతగా అనిపించినప్పటికీ.. వరుస మరణాలతో చితికిపోయిన ఆ ఊరి ప్రజలు తమ శాంతి కోసం, మానసిక ధైర్యం కోసం ఈ సంప్రదాయాన్ని పాటించారు. ప్రస్తుతం గండ్రపల్లి గ్రామం నిర్మానుష్యంగా మారి, ఇళ్లన్నీ తాళాలు వేసి కనిపిస్తున్నాయి.

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×