E-Paper
Advertisement

నడిచే కూలర్ ..ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఢిల్లీ డ్రైవర్ వీడియో!

నడిచే కూలర్ ..ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఢిల్లీ డ్రైవర్ వీడియో!
Advertisement

Rickshaw AC: ఏసీ కార్లలో తిరిగే వాళ్లకి ఎండలతో పెద్దగా ఇబ్బంది ఉండదు.కాని రిక్షాలు, ఆటోల్లో ప్రయాణించే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. అందుకే వారికీ ఒక ac ఉండాలంటూ ఖరీదైన టెక్నాలజీ అందుబాటులో లేకపోయినా, అతి తక్కువ ఖర్చుతో తన ప్రయాణికుల సౌకర్యం కోసం ఆ డ్రైవర్ ఆలోచించిన తీరు అద్భుతం.అవును వారి కష్టాన్ని గమనించిన ఒక సామాన్య ఈ-రిక్షా డ్రైవర్, తన మెదడుకు పదును పెట్టి చేసిన ఈ ఆవిష్కరణ ఇప్పుడు నెట్టింటిని షేక్ షేక్ చేస్తోంది. అతడి క్రియేటివిటీ  ఫిదా అయిన జనం, ఇప్పుడు అతడిని ముద్దుగా ‘నడిచే ఏసీ’ అని పిలుస్తున్నారు కూడా.
విషయం లోకి వెళ్తే ..

also read :రణబీర్ కపూర్ నెక్స్ట్ హోమ్ అయోధ్యలోనేనా? కోట్లు పెట్టి కొన్న స్థలం డీటెయిల్స్ ఇవే!

Advertisement

సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్

సాధారణంగా ఎయిర్ కూలర్లలో గడ్డి పొరలను వాడుతుంటారని మనకు తెలుసు. అదే సూత్రాన్ని ఈ డ్రైవర్ తన రిక్షాకు అప్లయ్ చేశాడు . తన ఈ-రిక్షా పైన, చుట్టుపక్కల కూలర్లలో వాడే గడ్డి మ్యాట్లను (Cooler Grass Mats) అమర్చాడు. కేవలం గడ్డిని అమర్చడంతోనే ఆగకుండా, ఆ గడ్డి ఎప్పుడూ తడిచి ఉండేలా చిన్న వాటర్ పైపులను, ఒక చిన్న మోటార్‌ను కూడా సెట్ చేశాడు. రిక్షా రోడ్డుపై వేగంగా వెళ్తున్నప్పుడు, బయట నుంచి వచ్చే వేడి గాలి ఈ తడి గడ్డి గుండా ప్రయాణించి, లోపల ఉన్న ప్రయాణికులకు ఏసీ కంటే చల్లని అనుభూతిని ఇస్తోంది. ఇపుడు @ThePushpraj అనే యూజర్ X (గతంలో Twitter) వేదికగా షేర్ చేసిన ఆ రిక్షా ac వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Advertisement

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “డిగ్రీలు లేని అసలైన ఇంజనీర్ ఇతడే” అని కొందరు పొగుడుతుంటే,అవసరం పడితే అదే మనల్ని ఇలాంటివి చేయడానికి దారి చూపిస్తుంది అంటూ మరికొంతమందికామెంట్ చేస్తున్నారు. ఢిల్లీ లాంటి నగరాల్లో ఎండ దెబ్బ నుంచి సామాన్యులను రక్షించడానికి ఇది ఒక స్మార్ట్ మరియు ఎకో-ఫ్రెండ్లీ మార్గమని అందరూ మెచ్చుకుంటున్నారు . తన కష్టం కంటే ప్రయాణికుల చల్లదనం ముఖ్యమని భావించిన ఈ డ్రైవర్ ఐడియా ప్రస్తుతం నెట్టింట ‘హాట్ టాపిక్’గా మారింది.చూడాలి ముందు ముందు ఇలాంటి క్రేజీ ఇన్వెన్షన్స్ తో ఇంకెంతమంది ముందుకు వస్తారో !

also read :దళపతి విజయ్ నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ పీఠమేనా? వైరల్ అవుతున్న జ్యోతిష్యుడి జోస్యం

Tags

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×