E-Paper
Advertisement

Drunk Thief: ఇంట్లో దొంగతనానికి వెళ్లి.. గుర్రుపెట్టి పడుకున్నాడు.. ఫస్ట్ టైమ్ అనుకుంటా..!

Drunk Thief: ఇంట్లో దొంగతనానికి వెళ్లి.. గుర్రుపెట్టి పడుకున్నాడు.. ఫస్ట్ టైమ్ అనుకుంటా..!
Advertisement

Drunk Thief: సాధారణంగా దొంగలు చాలా అలర్ట్ గా ఉంటారు. ఏ ఇంటికి చోరికి వెళ్లినా ఒకటికి రెండుసార్లు రెక్కీ నిర్వహిస్తుంటారు. దోపిడి అనంతరం ఏ విధంగా బయటపడాలి? పోలీసులకు క్లూలు దొరక్కుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి వాటిపై ముందుగానే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. అయితే కర్ణాటకలో ఓ దొంగ మాత్రం ఇవేమి పాటించలేదు. వ్యాపారి ఇంట్లోకి చొరబడి.. నేలపై గుర్రుపెట్టి పడుకుండిపోయాడు.

వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటక చిక్కబళ్లాపూర్ జిల్లా గౌరిబిదనూర్ (Gauribidanur)కు చెందిన స్థానిక వ్యాపారి ప్రేమ్ నాథ్ ఇంట్లో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ప్రేమ్ నాథ్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. దీనిని గమనించిన ఇద్దరు దొంగలు.. అతడి ఇంటిపై కన్నేశారు. చోరికి పథకం రచించారు. గ్యాస్ కట్టర్ ఉపయోగించి ఇంటి పైకప్పును తొలగించారు. దాని గుండా లోపలికి ప్రవేశించారు.

స్థానికులను గమనించి..

Advertisement

ప్రేమ్ నాథ్ ఇంట్లో భారీ మెుత్తంలో ఆశించిన దొంగలకు నిరాశే ఎదురైంది. కేవలం రూ.5000 నగదు, కొద్దిపాటి బంగారు ఆభరణాలు మాత్రమే వారికి లభించాయి. దీంతో ఆ వస్తువులను జేబులో వేసుకొని.. ముందుగా ఒక దొంగ ఇంటి పైకప్పు ఎక్కాడు. అయితే ఇంటి ముందు టార్చిలైట్లతో స్థానికులు ఉండటాన్ని గమనించి నెమ్మదిగా కిందకు దిగాడు.

మద్యం మత్తులో..

అనంతరం లోపల ఉన్న మరో దొంగకు బయటి పరిస్థితుల గురించి తెలియజేశాడు. గుట్టుచప్పుడు కాకుండా రావాలని సిగ్నల్ ఇచ్చాడు. అయితే అప్పటికే ఫుల్లుగా మద్యం తాగి దొంగతనానికి వచ్చిన మరో దొంగ.. మత్తులో బయటకు రాలేకపోయాడు. అయితే ఇంటి చుట్టుపక్కల అనుమానస్పద కదలికలు, శబ్దాలను గమనించిన స్థానికులు అప్రమత్తమయ్యారు. ఇంటి పైకప్పు తెరిచి ఉండటం చూసి దానిని వెంటనే మూసివేశారు. దీంతో చేసేది లేక రెండో దొంగ రాత్రంతా ఇంట్లోనే ఉండిపోయాడు. మద్యం మత్తులో ఇంటి నేలపై గుర్రు పెట్టి నిద్రపోయాడు.

Advertisement

Also Read: AP Budget Session: పవన్‌తో నాగబాబు, బాలయ్య భేటి.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ!

యజమాని వచ్చి చూడగా..

మర్నాడు ఉదయం ప్రేమ్ నాథ్.. హైదరాబాద్ నుంచి ఇంటికి తిరిగివచ్చాడు. తలుపులు తెరిచి చూడగా.. దొంగ నేలపై నిద్రపోతూ కనిపించాడు. దీంతో స్థానికుల సాయంతో అతడ్ని నిర్భందించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. హుటాహుటీనా ప్రేమ్ నాథ్ ఇంటికి చేరుకొని దొంగను అదుపులోకి తీసుకున్నారు. దొంగను విచారించగా తనతోపాటు వచ్చిన మరో వ్యక్తి గురించి కూడా తెలియజేశాడు. పరారీలో ఉన్న మరో దొంగ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: YS Sharmila: సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్.. వైసీపీ వాకౌట్ సిగ్గుచేటు.. సూటి ప్రశ్నలతో ఏకిపారేసిన షర్మిల

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×