E-Paper
Advertisement

Death Pool: ఈ కొలనులోకి దిగితే చావడం ఖాయం.. ‘డెత్ పూల్’ గురించి ఈ భయంకరమైన నిజాలు తెలుసా?

Death Pool: ఈ కొలనులోకి దిగితే చావడం ఖాయం.. ‘డెత్ పూల్’ గురించి ఈ భయంకరమైన నిజాలు తెలుసా?
Advertisement

Death Pool: ప్రపంచంలో మనకు తెలియని, ఆశ్చర్యపరిచే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ఎలా ఏర్పడ్డాయో? ఎందుకు అలా ఉన్నాయో? ఇప్పటికీ శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కడం లేదు. అలాంటి వింతైన ప్రదేశాల జాబితాలోకి వచ్చే ఓ భయంకరమైన ప్రదేశమే ఈ ‘పూల్ ఆఫ్ డెత్’. ఇది సాధారణ నీటి కొలను కాదు. ఇందులోకి అడుగుపెట్టిన ప్రతి జీవికి అదే చివరి రోజని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వినడానికి కాస్త అతిశయంగా అనిపించినా.. ఇప్పటివరకు ఈ కొలనులోకి దిగిన ఏ ఒక్కరూ సజీవంగా బయటకు రాలేదట. ఇప్పుడీ మృత్యు కొలను కథేంటో తెలుసుకుందాం.

ఇదొక మృత్యు కొలను:

ప్రపంచంలోనే అత్యంత ఉప్పుగా ఉండే సముద్రాల్లో ‘ఎర్ర సముద్రం’ ఒకటి. ఇదే సముద్రంలో దాదాపు 1,770 మీటర్ల లోతులో మియామీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రాణాంతక కొలనును గుర్తించారు. సౌదీ అరేబియా తీరానికి సుమారు 5,800 అడుగుల దూరంలో ఉన్న ఈ ప్రాంతం చుట్టూ వాతావరణమే భయంకరంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

చనిపోవడానికి కారణమేంటి?

Advertisement

ఈ కొలనులోని నీరు సాధారణ సముద్ర జలాల్లా కాదు. ఇందులో ఆక్సిజన్ స్థాయి అత్యంత తక్కువగా ఉంటుంది. అంతేకాదు.. హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి ప్రమాదకరమైన విష రసాయనాలు కూడా ఇందులో కలిసి ఉంటాయి. ఉప్పు మోతాదు అయితే సాధారణ సముద్రం కంటే ఏకంగా 7 నుంచి 8 రెట్లు ఎక్కువ. ఈ కారణాల వల్లే ఏ జీవి ఇందులోకి వెళ్లినా బతికే అవకాశం ఉండదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

చెక్కుచెదరని మృతదేహాలు:

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ కొలనులో చనిపోయిన జీవులు కుళ్లిపోవు. అధిక ఉప్పు శాతం వల్ల ఈ నీరు సహజ ప్రిజర్వేటివ్‌లా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే మృతదేహాలు చాలాకాలం పాటు అలాగే ఉండిపోతాయి. ఈ లక్షణమే ఈ కొలనును మరింత భయానకంగా మారుస్తోంది.

అవగాహన ఏర్పరచుకోవాలి:

Advertisement

ఇకపోతే.. ప్రకృతి సృష్టించిన ఈ పూల్ ఆఫ్ డెత్ మానవుడికి ఓ హెచ్చరిక అని  నిపుణులు చెబుతున్నారు. అలాగే భూమ్మీద మనకు ఇంకా తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయని, అలాంటి ప్రదేశాలకు వెళ్లడాని కంటే ముందు.. ఆ ప్రదేశాల గురించి రీసెర్చ్ చేయాలని, అలా చేయడం వల్ల కొంత అవగాహన ఏర్పడుతుందని చెబుతున్నారు.

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×