// // Viral Video: రీల్స్ పిచ్చితో.. రైలులో వెర్రి వేషాలు.. చివరికి! -->
E-Paper
Advertisement

Viral Video: రీల్స్ పిచ్చితో.. రైలులో వెర్రి వేషాలు.. చివరికి ఏమైందో చూడండి!

Viral Video: రీల్స్ పిచ్చితో.. రైలులో వెర్రి వేషాలు.. చివరికి ఏమైందో చూడండి!
Advertisement

Viral Video: రీల్స్ పిచ్చితో కొందరు యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సాహసం చేస్తున్నామన్న భ్రమలో ఉంటూ.. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి మరి రీల్స్ చేయాల్సిన పనిలేదని అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు పట్టించుకోవడం లేదు. తాజాగా ఇందుకు సంబంధించిన ఘటన మరొకటి జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఓ యువకుడు కదులుతున్న రైలులో రీల్స్ చేస్తూ తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను నిషాద్ అనే వ్యక్తి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా.. అది క్షణాల్లోనే వైరల్ గా మారింది. వీడియోను గమనిస్తే.. కదులుతున్న రైలు డోర్ వద్ద ఓ యువకుడు నిలబడి ఉన్నాడు. ఓ వ్యక్తి ఫోన్ లో వీడియో తీస్తుండగా ఆ కుర్రాడు డోర్ దగ్గర ప్రమాదకరంగా వేలాడుతూ ఫోజులు ఇచ్చాడు. ఈ క్రమంలో బయటి వైపునకు మరింత బెండ్ కావడంతో.. పట్టాలపై ఉన్న స్తంభం అతడి తలకు బలంగా తాకింది. ఆ దెబ్బకు ఒక్కసారిగా యువకుడు రైలు నుంచి కిందపడిపోయాడు.

Advertisement

యువకుడు ప్రమాదానికి గురి కావడంతో వీడియో తీస్తున్న వ్యక్తి సైతం ఖంగుతిన్నాడు. వెంటనే షూట్ చేయడాన్ని ఆపేశాడు. అయితే ఈ ఘటన ఎప్పుడు? ఎక్కడ? జరిగిందన్న దానిపై క్లారిటీ లేదు. ప్రమాదానికి గురైన యువకుడి క్షేమ సమాచారాలపై సైతం స్పష్టత రాలేదు. అయితే ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు. రైళ్లల్లో ఇలాంటి ప్రమాదక స్టంట్స్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో.. ఈ వీడియో అద్దం పడుతోందని పేర్కొంటున్నారు.

Advertisement

Also Read: Strait of Hormuz: యుద్ధం వేళ.. భారత్‌కు ఇరాన్ గుడ్ న్యూస్.. హమ్మయ్య ప్రశాంతంగా ఉండొచ్చు!

రైళ్లల్లో ఈ తరహా విన్యాసాలకు సంబంధించిన వీడియోలు అడపాదడపా నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. వ్యూస్, సబ్ స్క్రైబర్ల కోసం కొందరు యువకులు.. పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. కదులుతున్న రైలు కింద పడుకోవడం, వేగంగా వెళ్తున్న రైలుతో సెల్ఫీ వీడియో దిగాలని ప్రయత్నించడం ఇటీవల చూస్తూనే ఉన్నాం. అలాగే ఎత్తైన బిల్డింగ్ ఎక్కి విన్యాసాలు చేయడం, బైక్ స్టంట్స్ దృశ్యాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. యువత ఈ విధంగా చేసే ముందు.. వారి తల్లిదండ్రుల గురించి ఒకసారి ఆలోచించాలని అధికారులు సూచిస్తున్నారు. సోషల్ మీడియా ఫేమ్, సెలబ్రిటీ స్టేటస్ కంటే ప్రాణాలు చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

Also Read: Indian Origin Murder: కెనడాలో ఘోరం.. భారత సంతతి మహిళా యూట్యూబర్‌ను.. కత్తులతో పొడిచి హత్య

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×