E-Paper
Advertisement

Viral News: సినిమా లెవల్ క్లైమాక్స్ సీన్.. తాళికట్టే టైంకి పెళ్లి కూతురు అలా చేసిందేంటి?

Viral News: సినిమా లెవల్ క్లైమాక్స్ సీన్.. తాళికట్టే టైంకి పెళ్లి కూతురు అలా చేసిందేంటి?
Advertisement

Viral News: పెళ్లి వేడుకలో అత్యంత కీలకమైన ఘట్టం.. వధువు మెడలో వరుడు మూడు ముళ్లు వేసే సమయం. సరిగ్గా ఆ శుభముహూర్తంలో అందరినీ విస్మయానికి గురిచేస్తూ పల్లవి అనే యువతి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను మరొకరిని ప్రేమిస్తున్నానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో కల్యాణ మంటపమంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది.

పల్లవి తాను వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమిస్తున్నానని, సామాజిక కట్టుబాట్లు , కుటుంబ గౌరవం దృష్ట్యా ఆ విషయాన్ని ముందుగా తల్లిదండ్రులకు చెప్పలేకపోయానని ఆవేదనతో వివరించింది. అయితే, చివరి నిమిషంలో మనస్సాక్షికి విరుద్ధంగా వ్యవహరించలేక తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. తల్లిదండ్రులు, బంధువులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. తన నిర్ణయంలో ఏమాత్రం మార్పు లేదని పల్లవి స్పష్టం చేసింది.

Advertisement

ఈ క్లిష్ట పరిస్థితుల్లో వరుడు వేణుగోపాల్ ప్రదర్శించిన పరిణతి అందరినీ ఆకట్టుకుంది. తనను ప్రేమించని వ్యక్తిని బలవంతంగా వివాహం చేసుకోవడం సరికాదని భావించిన వేణుగోపాల్, ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తూ పెళ్లిని రద్దు చేసుకున్నాడు. ‘బలవంతపు పెళ్లితో ఎవరూ సంతోషంగా ఉండలేరు’ అని అతను చెప్పిన మాటలు అతని వ్యక్తిత్వాన్ని చాటిచెప్పాయి. ఆవేశాలకు పోకుండా, ఒక యువతి భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం సామాజికంగా ఒక చర్చకు దారితీసింది.

Also Read: జనగామ జిల్లాలో విషాదం.. వాగులో పడి ఇద్దరు బాలురు మృతి!

Advertisement

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×