E-Paper
Advertisement

Viral Video: పాక్‌లో చైనా యువకుడు వెకిలిచేష్టలు.. బుర్ఖా మహిళలను ఆ రేంజ్‌లో, వీడియో వైరల్

Viral Video: పాక్‌లో చైనా యువకుడు వెకిలిచేష్టలు.. బుర్ఖా మహిళలను ఆ రేంజ్‌లో, వీడియో వైరల్
Advertisement

Viral Video: ఇస్లామాబాద్‌లో బుర్ఖా వేసుకున్న మహిళలకు అవమానమా? అక్కడి మహిళల  పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు ఓ చైనా యువకుడు. ఇప్పుడు దీనిపై అక్కడ ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకపోవడాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.

ఇస్లామాబాద్‌లో చైనా యువకుడు వెకిలిచేష్టలు

Advertisement

పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌ సిటీలో బురఖా ధరించిన మహిళలను చైనా యువకుడు ఓ రేంజ్‌లో ఎగతాళి చేస్తున్నాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. F-10 మర్కజ్ ప్రాంతంలోని మార్కెట్‌లో చిత్రీకరించబడినట్లు కనిపించింది. దీనిపై విమర్శలు-రాజకీయ వ్యాఖ్యలు, ఆన్‌లైన్ వాదనలకు దారితీసింది.

బురఖా ధరించిన మహిళలకు చైనా యువకుడు సిగరెట్లు అందిస్తున్నట్లు, స్థానికులను ఎగతాళి చేస్తున్నట్లు, డబ్బులు చెల్లించకుండా ఆహారం తీసుకుంటున్నట్లు ఆ క్లిప్‌లో కనిపించింది. అదే సమయంలో అతని సహచరులు కెమెరా వెనుక నవ్వుతున్నట్లు వినిపిస్తోంది.

Advertisement

బుర్ఖా ధరించిన మహిళలను ఆ రేంజ్‌లో

పాక్ సాంస్కృతిక, సామాజిక సందర్భాన్ని బట్టి అనుచితంగా ఉందని చాలామంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆ సమయంలో మహిళలు స్పష్టంగా అసౌకర్యంగా కనిపించారు. మహిళల నుంచి కనీస స్పందన రాలేదు. ఆ వ్యక్తి, అతని స్నేహితులు నవ్వుతూ చిత్రీకరిస్తూనే ఉన్నారు.

గ్యాంగ్‌స్టర్ల మాదిరిగా వీధుల్లో నడవడం, స్థానికులను ఎగతాళి చేయడం, రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ నుండి స్నాక్స్ తీసుకోవడం, డబ్బులు చెల్లించకుండా తినడం, నిర్లక్ష్యంగా వెళ్లిపోవడం అందులో కనిపించాయి. పాకిస్తాన్‌లో ప్రజలు సోషల్ మీడియా ద్వారా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్లిప్‌లు ఆన్‌లైన్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

ALSO READ: అమ్మ పేరున ఆస్తులు.. భార్యకు గుండు సున్నా

వీరి ప్రవర్తనకు అదుపు లేకుండా పోయిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆన్‌లైన్‌లో చర్చకు దారి తీసింది. ఆ యువకుడిపై చర్య తీసుకుంటే పాకిస్తాన్‌కు ఆ దేశంతోవున్న సన్నిహిత సంబంధాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. దీని ఫలితంగా చైనా యువకుడ్ని పాక్ పాలకులు ఏమీ అనలేదని పరిస్థితుల్లో ఉన్నారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో గురించి ఇస్లామాబాద్ పోలీసులు లేదా ఇతర అధికారుల నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. జాతీయతతో సంబంధం లేకుండా జవాబు దారీతనం, చట్టాన్ని సమానంగా అమలు చేయాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు .

 

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×