E-Paper
Advertisement

Viral Video: సీటు కోసం బస్సులో రచ్చ రచ్చ.. జుట్టు పట్టుకుని కొట్లాడుకున్న వీడియో మీరూ చూసేయండి!

Viral Video: సీటు కోసం బస్సులో రచ్చ రచ్చ.. జుట్టు పట్టుకుని కొట్లాడుకున్న వీడియో మీరూ చూసేయండి!
Advertisement

Viral Video: ప్రభుత్వ పథకాల్లో భాగంగా అందుబాటులోకి వచ్చిన ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు వెసులుబాటు కల్పించగా.. అదే సమయంలో కొన్ని అవాంఛీనీయ సంఘటనలకు వేదికగా మారుతోంది.  కేవలం ఒక బస్సు సీటు కోసం కొందరు మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకునే వరకు వెళ్తున్నారు. తాము ఎక్కడ ఉన్నాము, చుట్టూ ఎవరు ఉన్నారు అనే కనీస స్పృహ కూడా లేకుండా విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. అలాంటి ఘటనే ఇప్పుడు అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్‌గా మారింది.

అనంతపురం జిల్లా ఉరవకొండలో బస్సులో సీటు విషయంలో ఇద్దరు మహిళల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాయకొండ నుంచి ఉరవకొండకు వెళ్తున్న బస్సులో.. సీటుకోసం మెుదలైన మాటలు తూటాలుగా మారి ఉద్రిక్తతకు దారితీశాయి.

Advertisement

మాటా మాటా పెరిగి పరిస్థితి అదుపు తప్పడంతో.. బస్సులోనే జుట్టు, జుట్టు పట్టుకుని కొట్టుకునే స్థాయికి చేరింది. రన్నింగ్ బస్సులోనే ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు  భయాందోళన గురయ్యారు. తోటి  ప్రయాణికులు మధ్యలో జోక్యం చేేసుకుని శాంతింపచేయడానికి ప్రయత్నించినా.. మహిళలు వెనక్కి తగ్గలేదు. పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని గ్రహించిన డ్రైవర్ బస్సును నేరుగా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ పోలీసులు జోక్యం చేసుకుని ఇద్దరి మహిళలను మందలించారు. వివాదాన్ని అదుపులోకి తీసుకుని హెచ్చిరించిన అనంతరం వారిని పంపించారు.

ALSO READ: Road Accident: యువకుడి పైనుంచి వెళ్లిన ట్రావెల్ బస్సు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Advertisement

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×