E-Paper
Advertisement

Viral Video: వారెవ్వా.. ఈ బాలిక తెగువ చూస్తే.. ఎవరైనా మెచ్చుకోవాల్సిందే!

Viral Video: వారెవ్వా.. ఈ బాలిక తెగువ చూస్తే.. ఎవరైనా మెచ్చుకోవాల్సిందే!
Advertisement

Viral Video: లిఫ్టులో చిక్కుపోయిన ఇద్దరు చిన్నారులను ఓ బాలిక అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి కాపాడింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలిక ప్రదర్శించిన తెగువ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఘటన లిఫ్ట్ భద్రతను మరోమారు చర్చకు తీసుకొచ్చింది.

వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే.. ఇద్దరు చిన్నారులు లోపల ఉండగా లిఫ్ట్ డోర్ అకస్మాత్తుగా మూసుకుపోవడం ప్రారంభించింది. దీంతో అప్రమత్తమైన బాలిక.. లిఫ్ట్ డోరు పూర్తిగా మూసుకోకుండా అడ్డుపడింది. డోర్లకు మధ్య కాలు అడ్డుపెట్టి రెండు చేతులతో తెరిచే ప్రయత్నం చేసింది. దీనిని గమనించిన ఇద్దరు మహిళలు.. లిఫ్ట్ వద్దకు చేరుకొని బాలికకు సాయం చేసారు.

Advertisement

లిఫ్ట్ డోర్ ను ఇద్దరు మహిళలు అతి కష్టం మీద తెరవగా.. బాలిక డోర్ల మధ్యలో నిలబడి లోపలున్న ఇద్దరు చిన్నారులను బయట వైపునకు తీసుకొచ్చింది. అనంతరం బాలిక కూడా డోర్ల మధ్య నుంచి వచ్చేయడంతో అవి అమాంతం మూసుకుపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా.. అవి వైరల్ గా మారాయి.

Advertisement

Also Read: Summer 2026 Guide Car: సమ్మర్ లో మీ కారు కూల్ గా ఉండాలంటే, ఈ స్మార్ట్ ట్రిక్స్ ఫాలో అయిపోండి!

మరోవైపు బాలిక చూపిన తెగువపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి చిన్నారులను రక్షించిందని ఆకాశానికెత్తుతున్నారు. అదే సమయంలో ఆ లిఫ్ట్ లోని సాంకేతిక లోపాలను ఎత్తిచూపుతున్నారు. సాధారణంగా లిఫ్ట్ డోర్లకు అడ్డుగా చేతులు పెడితే సెన్సార్లు గ్రహించి తెరుచుకుంటాయని.. ఈ లిఫ్ట్ లో అలా జరగలేదని నెటిజన్లు అంటున్నారు. ఇలాంటి లిఫ్ట్ లు ప్రాణాంతకంగా మారవచ్చని చెబుతున్నారు. చిన్న పిల్లలను లిఫ్ట్ వద్దకు ఒంటరిగా పంపవద్దని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.

Also Read: New vs Old Tata Punch EV: కొత్త, పాత టాటా పంచ్ ఈవీలో ఎది బెస్ట్? ఎందుకు?

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×