E-Paper
Advertisement

Bengaluru Crime: ప్రియురాలి పెళ్లి పత్రిక చూసి యువ బాడీబిల్డర్ ఆత్మహత్య

Bengaluru Crime: ప్రియురాలి పెళ్లి పత్రిక చూసి యువ బాడీబిల్డర్ ఆత్మహత్య
Advertisement

Bengaluru Crime: బెంగళూరులో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి మరొకరితో పెళ్లికి సిద్ధమై, స్వయంగా ఆహ్వాన పత్రికను పంపడంతో మనస్తాపానికి గురైన ఓ యువ బాడీబిల్డర్ బలన్మరణానికి పాల్పడ్డాడు.

బెంగళూరుకు చెందిన కిరణ్ అనే యువకుడు వృత్తిరీత్యా బాడీబిల్డర్. అతను గత మూడేళ్లుగా ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తున్నాడు. వీరిద్ధరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో.. త్వరలోనే పెళ్లి చేసుకుంటామని అతను భావించాడు. అయితే.. ఊహించని విధంగా ఆ యువతి కిరణ్‌ను కాదని వేరొకరితో వివాహానికి సిద్ధమైంది. కేవలం నిశ్చితార్థం చేసుకోవడమే కాకుండా.. తన పెళ్లి పత్రికలను, పెళ్లి కోసం కొనుక్కున్న కొత్త చీరను కిరణ్‌కు పంపింది.

Advertisement

తనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఇలా పెళ్లి పత్రిక పంపడాన్ని కిరణ్ తట్టుకోలేకపోయాడు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమెకు ఇవ్వడం కోసం అతను ఇప్పటికే ఒక ఖరీదైన బహుమతిని కూడా సిద్ధం చేసుకున్నాడు. కానీ.. అంతలోనే ఆమె పెళ్లి పత్రిక చేతికందడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆ క్షణికావేశంలోనే అతను ఆత్మహత్య చేసుకుని తన ప్రాణాలను తీసుకున్నాడు.

కిరణ్ మరణంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.‘ మా కొడుకు ఆమెను ఎంతగానో నమ్మాడు.. సదరు యువతి కుటుంబానికి ఉన్న రూ.50 లక్షల అప్పును కూడా తానే తీరుస్తానని హామీ ఇచ్చాడు. ఆమె కోసం ఎంతో తపించాడు. కానీ.. ఆమె పెళ్లి పత్రిక పంపి అతడి గుండె పగులేలా చేసింది’ అని వారు వాపోయారు. తన కొడుకు మరణానికి ఆ యువతే కారణమని వారు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also Read: రెండేళ్లలో వచ్చేది మన ప్రభుత్వమే.. నేనే మంత్రిని.. పోలీసులకు హరీష్ రావు మాస్ వార్నింగ్

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×